Rajasthan Bandh Call | కర్ణి సేన చీఫ్ హత్యోదంతంపై రాజస్ధాన్ అంతటా నిరసనలు
రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్ బంద్‌కు (Rajasthan Bandh Call) పిలుపు ఇచ్చింది.
జైపూర్ : రాష్ట్రీయ రాజ్పుట్ కర్ణి సేన చీఫ్ సుఖ్‌దేవ్ సింగ్ హత్యకు నిరసనగా కర్ణిసేన, ఇతర గ్రూపులు బుధవారం రాజస్ధాన్ బంద్‌కు (Rajasthan Bandh Call) పిలుపు ఇచ్చాయి. బంద్ పిలుపులో భాగంగా కర్ణి సేన శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు చేపట్టాయి. సుఖ్ధేవ్ సింగ్ హత్యోదంతంపై న్యాయ విచారణ జరిపించాలని కర్ణి సేన కార్యకర్తలు డిమాండ్ చేశారు.
సుఖ్ధేవ్ సింగ్‌కు భద్రత కల్పించాలని కోరామని, ఇలాంటి ఘటన జరుగుతుందనే ఆందోళనతో ప్రభుత్వానికి లేఖలు రాశారని, దానికి సంబంధించిన ఆధారాలు ఉన్నాయని కర్ణి సేన వ్యవస్ధాపకుడు లోకేంద్ర సింగ్ కల్వి కుమారుడు భవాని సింగ్ కల్వి వివరించారు. సుఖ్ధేవ్ సింగ్‌కు ఎందుకు భద్రత కల్పించలేదనేది ప్రశ్నార్ధకంగా మారిందని అన్నారు.
ఈ ఘటనపై అసెంబ్లీకి నూతనంగా ఎన్నికైన బీజేపీ ఎమ్మెల్యే దియా కుమారి స్పందిస్తూ కర్ణిసేన చీఫ్ హత్య దిగ్భ్రాంతికి లోనుచేసిందని అన్నారు. ఈ ఘటనను ఖండించేందుకు తనకు మాటలు రావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు. సుఖ్ధేవ్ సింగ్ కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతి తెలియచేస్తున్నానని అన్నారు. సుఖ్ధేవ్ సింగ్‌ను మంగళవారం జైపూర్‌లోని ఆయన నివాసంలో సాయుధ దుండగులు కాల్చిచంపిన ఘటన కలకలం రేపిన సంగతి తెలిసిందే.
Read More :
Geetika Koul | మంచు శిఖరంపై మహిళాకేతనం.. సియాచిన్‌లో తొలి మహిళా ఆర్మీ అధికారి విధులు
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
Iran Nuclear Programme | ఇరాన్ ‘అణు’ గుట్టు చెబితే 20 మిలియన్ డాలర్లు
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

