మహిళపై రాజ్‌ఠాక్రే గూండాల దాడి
రాజ్‌ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొందరు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఒకరిపై దాడులకు తెగబడ్డారు. ఎంఎన్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్రకాశ్ దేవీ అనే మహిళకు చెందిన మందుల దుకాణం ముందు కొందరు కర్రలు పాతారు. వాటిని తొలగించాలని పార్టీ కార్యకర్త వినోద్ అర్గిలే సహా
ముంబై, సెప్టెంబర్ 1: రాజ్‌ఠాక్రే పార్టీ మహారాష్ట్ర నవ నిర్మాణ్ సేవ (ఎంఎన్ఎస్) కార్యకర్తలు కొందరు వీధి రౌడీల్లా ప్రవర్తించారు. మహిళ అని కూడా చూడకుండా ఒకరిపై దాడులకు తెగబడ్డారు. ఎంఎన్ఎస్ పార్టీ ఫ్లెక్సీలు కట్టడం కోసం ప్రకాశ్ దేవీ అనే మహిళకు చెందిన మందుల దుకాణం ముందు కొందరు కర్రలు పాతారు. వాటిని తొలగించాలని పార్టీ కార్యకర్త వినోద్ అర్గిలే సహా కొందరు కార్యకర్తలకు బాధితురాలు విజ్ఞప్తి చేశారు.
కానీ అవేవీ పట్టించుకోకుండా.. వాళ్లు ఆమెను బలంగా నెట్టేశారు. చెంపపై కొడుతూ రోడ్డుపై పడేశారు. అంతటితో ఆగకుండా దారుణమైన బూతులు తిట్టారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నది. ఆగస్టు 28న ఈ సంఘటన జరుగగా, పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తే పోలీసులు కేసు నమోదు చేయలేదని బాధితురాలు వాపోయారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
Road accident | రోడ్డు ప్రమాదంలో ఏఆర్ ఎస్ఐ ప్రసాద్ మృతి
Tribal woman sarpanch | గిరిజన మహిళా సర్పంచ్‌పై సీఐ దాడి.. బతుకమ్మ వేడుకల్లో ఘటన
Canada | కెనడాలో ఘోర అగ్రి ప్రమాదం.. నలుగురు సైనికులు మృతి .. 39 మంది తీవ్ర గాయాలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

