Rachin Ravindra: రచిన్ పేరును ఆ ఉద్దేశంతో పెట్టలేదు
Rachin Ravindra: రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను మిక్స్ చేసి రచిన్ పేరు పెట్టినట్లు వార్తలు వస్తున్న విషయం తెలిసిందే. అయితే ఆ కివీస్ క్రికెటర్ గురించి అతని తండ్రి కొన్ని విషయాలు చెప్పారు. రచిన్ పేరు పెట్టేందుకు తాము రాహుల్, సచిన్ పేర్లను కలపలేదన్నారు.
ముంబై: న్యూజిలాండ్ క్రికెటర్ రచిన్ రవీంద్ర(Rachin Ravindra) ప్రస్తుతం వరల్డ్‌కప్‌లో టాప్ బ్యాటింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తున్న విషయం తెలిసిందే. క్రికెటర్ అయిన అతని తండ్రి రవి కృష్ణమూర్తి ఓ అంశంపై క్లారిటీ ఇచ్చారు. రాహుల్ ద్రావిడ్, సచిన్ టెండూల్కర్ పేర్లను మిక్స్ చేసి .. రచిన్ అని పేరు పెట్టినట్లు ఇటీవల వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. ఆ అంశాన్ని రచిన్ తండ్రి రవి కృష్ణమూర్తి కొట్టిపారేశారు.
భారతీయ మూలాల ఉన్న రచిన రవీంద్ర ప్రస్తుతం న్యూజిలాండ్ తరపున ఆడుతున్నాడు. అతని గ్రాండ్‌పేరెంట్స్ బెంగుళూరులో ఉంటున్నారు. వరల్డ్‌కప్ వేళ నానమ్మ ఇంటికి కూడా అతను వెళ్లాడు. రచిన్ పేరుపై ఉన్న అనుమానాలను తండ్రి రవి కృష్ణమూర్తి క్లియర్ చేశాడు. రచిన్ కోసం ద్రావిడ్, సచిన్ పేర్లను మిక్స్ చేయలేదన్నాడు. రచిన్ పుట్టినప్పుడు ఆ పేరును తన భార్య సూచించిందని, దాని గురించి మేం ఎక్కువగా డిస్కస్ చేయకుండానే ఆ పేరును ఫిక్స్ చేసినట్లు రవి కృష్ణమూర్తి తెలిపాడు.
ఉచ్ఛరించడానికి రచిన్ పేరు బాగుందని, చిన్నగా ఉండడం వల్ల ఆ పేరునే ఉంచాలని నిర్ణయించామని, కానీ కొన్నాళ్ల తర్వాత అది రాహుల్, సచిన్ పేర్లను మిక్స్ చేసినట్లు ఉందని గ్రహించామన్నాడు. తన కుమారుడిని క్రికెటర్‌ను చేయాలన్న ఉద్దేశంతో ఆ పేరు పెట్టలేదన్నాడు.
తాజా వరల్డ్‌కప్‌లో ఇప్పటి వరకు 9 ఇన్నింగ్స్‌లు ఆడిన రచిన్.. మొత్తం 565 రన్స్ చేశాడు. వరల్డ్‌కప్‌లో మూడవ హయ్యస్ట్ స్కోరర్‌గా కొనసాగుతున్నాడు. అతని ఇన్నింగ్స్‌లో మూడు సెంచరీలు, రెండు హాఫ్ సెంచరీలు ఉన్నాయి. 70.62 యావరేజ్‌తో అతను స్కోరింగ్ చేస్తున్నాడు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
Osteoporoses | చిన్న వయసులోనే ఎముకల బలంపై శ్రద్ధ.. ఆస్టియోపోరోసిస్ ముప్పును తగ్గించుకోండిలా..
Ganja Seized | వాహనాల తనిఖీలో ఐదు కిలోల గంజాయి స్వాధీనం..భార్యభర్తల అరెస్ట్
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

