Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Fake CISF DSP | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఒక వ్యక్తి నటించాడు. విమానాశ్రయాలలో ఉద్యోగాలు, ఐఫోన్లతో సహా చౌక వస్తువులు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు.
గాంధీనగర్: సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (డీఎస్పీ)గా ఒక వ్యక్తి నటించాడు. విమానాశ్రయాలలో ఉద్యోగాలు, ఐఫోన్లతో సహా చౌక వస్తువులు ఇప్పిస్తానని పలువురిని మోసం చేశాడు. ఫిర్యాదులు అందుకున్న పోలీసులు ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. (Fake CISF DSP) గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఈ సంఘటన జరిగింది. పాలికా బజార్ సమీపంలో భద్రతా దళాల టీ షర్టు ధరించి, సీఐఎస్ఎఫ్ డీఎస్పీగా చెప్పుకుంటున్న ఒక వ్యక్తిని అహ్మదాబాద్ క్రైమ్ బ్రాంచ్ పోలీసులు అరెస్ట్ చేశారు. పంజాబ్‌లోని మలేర్‌కోట్లకు చెందిన అజ్మా ఏ సికందర్ అక్తర్ కంబోజ్గా అతడిని గుర్తించారు. నకిలీ సీఐఎస్ఎఫ్ గుర్తింపు కార్డును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
కాగా, సీఐఎస్ఎఫ్లో డీఎస్పీగా చెప్పుకున్న నిందితుడు కశ్మీర్ నుంచి వాల్నట్లు, కిరోసిన్, ఆర్మీ క్యాంటీన్లలో రాయితీపై లభించే వస్తువులు, ఐఫోన్లతో సహా పలు వస్తువులను తక్కువ ధరలకు ఇప్పిస్తానని నమ్మించి చాలా మందిని మోసం చేశాడని పోలీస్ అధికారి తెలిపారు. తాను విమానాశ్రయంలో పనిచేస్తానని, అక్కడ ఉద్యోగాలు ఇప్పిస్తానని, దుబాయ్ నుంచి చౌకైన ఫోన్లు తెప్పిస్తానని వాగ్దానాలు చేసి అహ్మదాబాద్‌లోని పలువురిని అతడు మోసం చేసినట్లు ఆరోపించారు.
మరోవైపు ఆన్లైన్ చెల్లింపులు స్వీకరించడానికి నిందితుడు కంబోజ్ వినియోగించిన ట్రావెల్ ఏజెన్సీలు, పెట్రోల్ బంకులు, ఇతర వ్యక్తులకు చెందిన బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు పోలీస్ అధికారి తెలిపారు. అలాగే జమ్ముకశ్మీర్‌లోని మజ్గావ్లో నమోదైన ఒక మోసం, దొంగతనం కేసులో అతడు నిందితుడిగా ఉన్నట్లు చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా అతడిపై ఏవైనా ఇతర కేసులు నమోదయ్యాయా? అన్నది పరిశీలిస్తున్నట్లు వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ollie Robinson | పాకిస్థాన్‌పై నిప్పులు.. మూడేళ్లకు మళ్లీ సెంట్రల్ కాంట్రాక్ట్..!
Fake CISF DSP | ఎయిర్‌పోర్ట్‌లో ఉద్యోగాలు, చౌకగా ఐఫోన్లు ఇప్పిస్తానంటూ మోసం.. నకిలీ సీఐఎస్ఎఫ్ డీఎస్పీ అరెస్ట్
Navaratri Brahmotsavams | తిరుమలలో వైభవంగా నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం
Nobel prize | అమెరికా ఆర్థికవేత్తలు రాబర్ట్ ఈ హాల్, మైఖేల్ వుడ్ఫోర్డ్కు అర్థశాస్త్ర నోబెల్
Cotton Procurement | కుభీర్‌లో పత్తి కొనుగోళ్లకు శ్రీకారం..క్వింటాల్‌కు రూ.9,100 చెల్లింపు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

