21 ఏండ్ల లోపున్న యువకులు పెండ్లి కాకున్నా యువతి సమ్మతితో సహజీవనం చేయవచ్చు : హైకోర్టు

చండీఘఢ్ : చట్టబద్ధ వివాహ వయసు 21 ఏండ్ల కంటే తక్కువ వయసున్న యువకుడు 18 ఏండ్లు అంతకు పైబడిన వయసున్న యువతి సమ్మతిస్తే వారు దంపతుల వలే కలిసి జీవించవచ్చని పంజాబ్ హర్యానా హైకోర్టు పేర్కొంది. పెండ్లి చేసుకోకుండా యువతీ యువకులు సహజీవనం చేయవచ్చని 2018 మేలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులకు అనుగుణంగా హైకోర్టు వ్యాఖ్యానించింది. పంజాబ్ గురుదాస్‌పూర్ జిల్లాకు చెందిన సహజీవనం చేస్తున్న ఓ జంట తమకు రక్షణ కల్పించాలని హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ విచారిస్తూ కోర్టు ఈ వ్యాఖ్యలు చేసింది. తమ కుటుంబ సభ్యుల నుంచి తమకు ప్రాణ హాని ఉందని వారు కోర్టును ఆశ్రయించారు.
కుటుంబసభ్యులు తమ సంబంధాన్ని వ్యతిరేకిస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని వివరించారు. ప్రతి పౌరుడి జీవితం, స్వేచ్ఛను కాపాడే బాధ్యత ప్రభుత్వానిదని, పిటిషనర్‌కు చట్టబద్ధ వివాహ వయసు లేదని కారణంతో భారత పౌరుడిగా రాజ్యాంగం ప్రసాదించిన పిటిషనర్ హక్కులను నిరాకరించరాదని జస్టిస్ హర్నరేష్ సింగ్ గిల్ పేర్కొన్నారు. తల్లితండ్రులు తమను బెదిరిస్తున్నారని, తమకు రక్షణ కల్పించాలని సహజీవనంలో ఉన్న పిటిషనర్ దంపతుల అభ్యర్ధనను పరిశీలించాలని, దీనిపై తగిన చర్యలు చేపట్టాలని కోర్టు పంజాబ్ పోలీసులను ఆదేశించింది. సహజీవనం చేస్తున్న జంట ఇద్దరూ మేజర్లు అయినప్పటికీ యువకుడి వయసు చట్టబద్ద వివాహ వయసు 21 ఏండ్ల కంటే తక్కువ కావడం గమనార్హం.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dorothy | ‘ది ప్యారడైజ్’, ‘డోరోతి’.. ఈ వీకెండ్ ఓటీటీలోకి వచ్చిన సినిమాలివే!
Sampoornesh Babu | మళ్లీ థియేటర్లలోకి సంపూర్ణేష్ బాబు ‘కొబ్బరి మట్ట’.. రీ రిలీజ్ డేట్ ఖరారు!
Indiramma Houses | ఇందిరమ్మ ఇల్లు మంజూరుకు లంచం డిమాండ్.. దళిత సర్పంచ్ మానస ఆవేదన
పోలీసు వ్యవస్థ పనితీరు అవగాహన కోసం ‘ఓపెన్ హౌస్’
Delhi school | స్కూల్లో కాలిన గాయాలతో మరణించిన 12వ తరగతి బాలిక.. అగ్నిప్రమాదంపై అనుమానాలు
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

