ఆ వీసీని తక్షణమే తొలగించండి.. పంజాబ్ సీఎంకు గవర్నర్ లేఖ
Banwarilal Purohit | బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు
చండీగఢ్: బీజేపీయేతర పార్టీలు అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో గవర్నర్లు, ప్రభుత్వాలకు మధ్య వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. జగదీప్ ధన్కర్ ఉపరాష్ట్రపతి కాకముందు పశ్చిమబెంగాల్ గవర్నర్గా పనిచేశారు. అప్పట్లో ముఖ్యమంత్రి మమతాబెనర్జికి, ఆయనకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమన్నది. మరోవైపు కేరళలోనూ గవర్నర్కు, ప్రభుత్వానికి మధ్య వివాదం నడుస్తున్నది.
ఈ క్రమంలోనే తాజాగా పంజాబ్లో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్కు, భగవంత్ మాన్ ప్రభుత్వానికి మధ్య వివాదం మొదలైంది. లూథియానాలోని పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వీసీ నియామకంపై వీరి మధ్య వార్ షురూ అయ్యింది. వీసీ సత్బీర్సింగ్ది అక్రమ నియామకమని, యూజీసీ నిబంధనలకు విరుద్ధంగా, ఛాన్సెలర్ అయిన తన ఆమోదం తీసుకోకుండా నియామకం జరిగినందున తక్షణమే ఆయనను తొలగించాలని గవర్నర్ పురోహిత్ సీఎం భగవంత్మాన్కు లేఖ రాశారు.
అయితే, గవర్నర్ తీరును పంజాబ్లోని ఆప్ సర్కారు తప్పుపట్టింది. రాష్ట్ర వ్యవసాయరంగానికి పంజాబ్ అగ్రికల్చరల్ యూనివర్సిటీ వెన్నెముఖ లాంటిదని, అలాంటి యూనివర్సిటీకి యూనివర్సీటీ బోర్డుచే వీసీగా నియమితులైన సత్బీర్సింగ్ను తొలగించాలని గవర్నర్ లేఖ రాయడం ఆయనను అవమానించడమేనని పంజాబ్ వ్యవసాయ శాఖ మంత్రి కేఎస్ ధలివాల్ విమర్శించారు. అందుకు గవర్నర్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

