పంజాబ్ సీఎంగా భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారం చేశారు. ఈ విషయంపై భగవంత్ మాన్ మాజీ భార్య ఇంద్రప్రీత్ కౌర్ మొదటి సారిగా స్పందించారు. మేం శారీరకంగా చాలా దూరంగా ఉండొచ్చు. కానీ ఎప్పుడూ ఆయన విజయం సాధించాలని ప్రార్థనలు చేస్తూనే వుంటాను. ఇక ముందు కూడా ఆయన సక్సెస్ కోసం ప్రార్థనలు చేస్తా. ఆయన విషయంలో నేనెప్పుడూ చెడుగా మాట్లాడలేదు అని ఇంద్రప్రీత్ కౌర్ అన్నారు. ఇక.. భగవంత్ మాన్ ప్రమాణ స్వీకారాన్ని పురస్కరించుకొని ఆయన కుమార్తె సీరత్ కౌర్ మాన్, కుమారుడు దిల్షాన్ మాన్ కూడా హాజరయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా వారిద్దరూ అమెరికా నుంచి చండీగఢ్‌కు వచ్చారు.
2014 లోక్‌సభ ఎన్నికల్లో ఇంద్రప్రీత్ కౌర్ భగవంత్ మాన్ కోసం చాలా ప్రచారం చేశారు. ఆయన గెలుపులో ఆమె పాత్ర కూడా వుంది. అయితే 2015 లో వీరిద్దరూ విడిపోయారు. విడాకుల తర్వాత ఇంద్రప్రీత్ కుమారుడు, కుమార్తెతో అమెరికాలో వుంటున్నారు.