Fantasy Gaming App | ఫాంటసీ గేమింగ్ యాప్‌లో రూ.1.5 కోట్లు గెలిచిన పోలీస్ అధికారి.. ఆన్లైన్లో జూదం ఆడటంపై దర్యాప్తు
Fantasy Gaming App | ఒక పోలీస్ అధికారి ఫాంటసీ గేమింగ్ యాప్ (Fantasy Gaming App) లో రూ.1.5 కోట్లు గెలిచాడు. బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పి చిక్కుల్లో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి ఆన్లైన్లో జూదం ఆడటంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు.
ముంబై: ఒక పోలీస్ అధికారి ఫాంటసీ గేమింగ్ యాప్ (Fantasy Gaming App) లో రూ.1.5 కోట్లు గెలిచాడు. బహిరంగంగా ఈ విషయాన్ని చెప్పి చిక్కుల్లో పడ్డాడు. ఈ నేపథ్యంలో ఆ పోలీస్ అధికారి ఆన్లైన్లో జూదం ఆడటంపై ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఈ సంఘటన జరిగింది. పింప్రి చించ్వాడ్ పోలీస్ కమిషనరేట్‌లో విధులు నిర్వహిస్తున్న సబ్ ఇన్స్పెక్టర్ సోమనాథ్ జెండే ప్రముఖ ఆన్లైన్ ఫాంటసీ గేమింగ్ ప్లాట్‌ఫారమ్ డ్రీమ్ 11లో రూ. 1.5 కోట్లు గెలిచాడు. ఆ డబ్బు ఆయన బ్యాంకు ఖాతాలో జమవుతున్నది.
కాగా, ఎస్ఐ సోమనాథ్ జెండే ఈ విషయాన్ని స్వయంగా వెల్లడించారు. రూ.1.5 కోట్లు గెలిచిన తాను ఆ డబ్బు రాదని తొలుత భావించినట్లు మీడియాతో అన్నారు. అయితే గురువారం రెండు లక్షలు తన ఖాతాలోకి బదిలీ అయ్యాయని చెప్పారు. ఇందులో రూ.60,000 మినహాయించి రూ.1.40 లక్షలు అందినట్టు తెలిపారు. మొత్తం డబ్బు వచ్చిన తర్వాత సగం డబ్బుతో ఇంటి రుణం తీరుస్తానని అన్నారు. అలాగే మిగతా సగం డబ్బును ఫిక్స్డ్ డిపాజిట్లలో పెట్టుబడి పెడతానని, దాని ద్వారా వచ్చే వడ్డీ డబ్బులు పిల్లల చదువు కోసం ఖర్చు చేస్తానని చెప్పారు.
మరోవైపు ఈ విషయం పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. దీంతో పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎస్ఐ సోమనాథ్ ఆన్లైన్ గేమ్‌లో పాల్గొనవచ్చా? ఈ గేమ్ చట్టబద్ధమేనా? ఇలా వచ్చిన డబ్బు గురించి మీడియాతో మాట్లాడవచ్చా? ఇదంతా నిబంధనల పరిధిలోకి వస్తాయా? అన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో దీనిపై విచారణ బాధ్యతను డీసీపీ స్వప్నా గోర్‌కు అప్పగించినట్లు పింప్రి చించ్వాడ్ ఏసీపీ సతీష్ మానే తెలిపారు. రిపోర్ట్ అందిన తర్వాత తగిన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
కొల్చారంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్ధం.. గ్రామంలో విద్యుత్ సరఫరా నిలిపివేత
Rudravanam PS | మారుమూల గ్రామం మిస్టరీతో ఆకట్టుకుంటున్న ‘రుద్రవనం పీఎస్’ ట్రైలర్!
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

