మరో బాంబు పేల్చిన కేంద్రం.. పీఎస్యూలను ప్రైవేటీకరిస్తే రాష్ట్రాలకు ప్రోత్సాహం

న్యూఢిల్లీ: ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తామని ప్రకటించిన కేంద్రం.. ఆ దిశగా మరో బాంబు పేల్చింది. నష్టాల్లో ఉన్న పీఎస్యూల మూసివేతకు చర్యలు తీసుకుంటామన్నది. రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరిస్తే సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రోత్సాహకాలు అందించే ప్రతిపాదన తమ పరిశీలనలో ఉన్నదని కేంద్ర మంత్రి అర్జున్ మేఘ్వాల్ మంగళవారం లోక్సభలో ప్రకటించారు. ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వ వైఖరి విషయమై తెలంగాణ నుంచి లోక్సభకు ప్రాతినిధ్యం వహిస్తున్న సభ్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి అడిగిన ప్రశ్నలకు సమాధానమిస్తూ అర్జున్ మేఘ్వాల్ పై సంగతి చెప్పారు.
నష్టాల్లో ఉన్న, ఖాయిలాపడ్డ ప్రభుత్వ రంగ సంస్థలను విక్రయిస్తామని స్పష్టం చేశారు. ఆయా ప్రభుత్వ రంగ సంస్థలను మూసివేయడానికి అవసరమైన నిబంధనలను సవరించేందుకు చట్టాలను మారుస్తామని తెలిపారు. త్వరలో విధి విధానాలు ఖరారవుతాయని వెల్లడించారు. ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణకు డిపార్ట్మెంట్ ఆఫ్ పబ్లిక్ ఎంటర్ప్రైజెస్ నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తుందని తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Will Sit On Dharna | ‘అక్కడ కూర్చొని ధర్నా చేస్తాం’.. ఢిల్లీ హైకోర్టు సమీపంలో రోడ్డు పనుల్లో జాప్యంపై సుప్రీంకోర్టు న్యాయమూర్తులు
Koppula Eshwar | ఎల్ నినో పేరు చెప్పి బాధ్యతల నుంచి తప్పించుకుంటున్న కాంగ్రెస్ : మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్
‘పాలమూరు-రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల పథకాలను యుద్ధ ప్రాతిపదికంగా పూర్తి చేయాలి’
Bangladesh | బంగ్లాదేశ్ రిసార్ట్లో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి.. 9 మందికి గాయాలు
TN CM Vijay | మ్యూజిక్ డైరెక్టర్ దేవాకు తమిళనాడు సీఎం, మాజీ సీఎం నివాళులు.. Videos
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

