PM Kisan Yojana | రైతుల ఖాతాల్లో కిసాన్ సమ్మాన్ నిధులు.. ప్రారంభించిన ప్రధాని మోదీ
PM Kisan Yojana | ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు.
PM Kisan Yojana | ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ సమ్మాన్ నిధి విడుదల చేశారు. మహారాష్ట్ర పర్యటనలో భాగంగా వాశింలో జరిగిన కార్యక్రమంలో ప్రధాని నిధుల విడుదలను ప్రారంభించారు. 18వ విడుతలో 9.4కోట్ల మంది రైతుల ఖాతాల్లో దాదాపు రూ.20వేలకోట్లు జమ కానున్నాయి. ఈ సందర్భంగా నమో షెత్కారీ మహాసమ్మాన్ నిధి యోజన సైతం ప్రారంభించారు. దేశవ్యాప్తంగా రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏటా రూ.6వేల చొప్పున మూడు విడుతల్లో కిసాన్ సమ్మాన్ నిధిని నేరుగా రైతుల ఖాతాల్లో సమ చేస్తున్న విషయం తెలిసిందే.
తొలి విడుతలో ఏప్రిల్ – జూలై మధ్య.. రెండో విడుతలో ఆగస్టు- నవంబర్.. మూడో విడుతలో డిసెంబర్-మార్చి మధ్య కేంద్రం సాయాన్ని రైతులకు అందిస్తున్నది. ఇక ఇప్పటి వరకు రూ.3.45 లక్షల కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసింది. కిసాన్ నిధులు సమ కాని రైతులు తప్పనిసరిగా ఈ-కేవైసీ చేయించుకోవాలని.. ఇందు కోసం అధికారిక వెబ్సైట్లో సంప్రదించాలని కేంద్ర సూచించింది. ఈ కార్యక్రమంలో మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్, కేంద్రమంత్రులు శివరాజ్ సింగ్ చౌహాన్, రాజీవ్ రంజన్ సింగ్, మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, ఉప ముఖ్యమంత్రులు దేవేంద్ర ఫడ్నవిస్, అజిత్ పవార్, మంత్రి సంజయ్ రాథోడ్ పాల్గొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
MP Gurumurthy | స్థానిక సంస్థల ఎన్నికలలో అక్రమాలపై నిష్పక్షపాత విచారణ జరిపించాలి : ఎంపీ గురుమూర్తి
‘సర్వభ్రష్ట ప్రభుత్వాన్ని మార్చేందుకు ప్రజలు సన్నద్ధం’
Srinidhi Shetty | బ్లాస్ట్ సినిమాతో ఎలాంటి కనెక్షన్ లేదు.. ‘ఆదర్శకుటుంబం’ హీరోయిన్ శ్రీనిధి శెట్టి
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
ఇరవెండి పంచాయతీ నిర్వహణపై డీపీవో అనూష ప్రశంస
ట్రెండింగ్ వార్తలు
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు

