Vande Bharat sleeper | పట్టాలెక్కనున్న తొమ్మిది వందే భారత్ స్లీపర్ రైళ్లు..! ప్రణాళికలు సిద్ధం చేస్తున్న రైల్వేశాఖ..!
Vande Bharat sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది.
Vande Bharat sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్ రైళ్లను ప్రవేశపెడుతున్నది. ఇప్పటికే పలుమార్గాల్లో సెమీహైస్పీడ్ రైళ్లు పరుగులుపెడుతున్నాయి. త్వరలోనే వందే భారత్ స్లీపర్ రైలు పట్టాలెక్కించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. సుదూర ప్రయాణాల్లో విప్లవాత్మక మార్పులను వందే భారత్ స్లీపర్ రైలు తీసుకువస్తుందని రైల్వేశాఖ పేర్కొంది. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (RDSO) తొలి వందే భారత్ స్లీపర్ ముంబయి – అహ్మదాబాద్ మార్గంలో 540 కిలోమీటర్ల దూరం ట్రయల్ రన్‌ను విజయవంతంగా నిర్వహించింది.
16 కోచ్‌లతో రైలు పరుగులు తీసింది. త్వరలోనే తొలి వందే భారత్ స్లీపర్ రైలును ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. ట్రయల్ రన్‌కు సంబంధించిన డేటాను విశ్లేషించిన అనంతరం ఆర్డీఎస్ఓ ఫైనల్ ధ్రువీకరణ పత్రం జారీ చేయనున్నది. రైల్వే సేఫ్టీ కమిషనర్ రైలును గరిష్ఠ వేగాన్ని పరిశీలించనున్నారు. ఈ ఏడాది జనవరి తొలివారం రైలు కోటాలో 30-40 కిలోమీటర్ల స్వల్ప దూరంలో ట్రయల్ రన్ నిర్వహించారు. ఈ సమయంలో రైలు 180 కిలోమీటర్ల వేగంతో దూసుకువెళ్లింది. వందే భారత్ స్లీపర్ రైళ్లు రాబోయే కాలంలో రాత్రి ప్రయాణాన్ని పునర్నిర్వహించబోతున్నాయని మంత్రిత్వ శాఖ పేర్కొంది. ప్రోటోటైప్ విజయవంతమైన ట్రయల్ రన్ పూర్తి చేసిందని మంత్రిత్వ శాఖ తెలిపింది.
ఈ ఏడాది మరో తొమ్మిది వందే భారత్ ట్రైన్ సెట్స్‌ను ఉత్పత్తి చేయాలని రైల్వేశాఖ భావిస్తుంది. ఏప్రిల్, డిసెంబర్ మధ్య ఐసీఎఫ్ డెలివరీ చేయనున్నది. ఈ రైలులో మూడు కేటగిరిలు అందుబాటులో ఉంటాయి. ఇందులో ఏపీ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్ ఏసీ, ఏసీ త్రీ టైర్ అందుబాటులో ఉంటాయి. మొత్తం 1,128 బెర్తులు ప్రయాణికులకు అందుబాటులో ఉంటాయి. గత నెలలో భారతీయ రైల్వేశాఖ 24 వందే భారత్ స్లీపర్ రైలు 50 రేకుల కోసం ఆర్డర్ వచ్చింది. రాబోయే రెండేళ్లలో సిద్ధమయ్యే అవకాశం ఉంది. 2026-27 సంవత్సరంలో 24 సెట్స్ ఉత్పత్తి కానున్నాయి. ఇది రైల్వే టెక్నాలజీలో భారత్ స్వావలంభనను మరింత బలోపేతం చేస్తుందని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

