కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నాం: యూపీ ఐజీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో రైతులను వాహనంతో తొక్కించి హత్య చేసినట్లు ఆరోపణలున్న కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా కోసం గాలిస్తున్నట్లు ఆ రాష్ట్ర ఐజీ లక్ష్మీ సింగ్ గురువారం తెలిపారు. రైతుల హత్య కేసులో ఆయన పేరు నమోదైందని, త్వరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు. సోషల్ మీడియాలో వైరల్ అయిన వీడియోలు, సమాచారం ఆధారంగా కూడా దర్యాప్తు జరుపుతామని వెల్లడించారు.
మరోవైపు రైతులపైకి దూసుకెళ్లిన వాహనంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని, నిరసన చేస్తున్న రైతులపై కాల్పులు జరిపినట్లు ఎఫ్ఐఆర్లో నమోదైంది. ఆశిష్ మిశ్రా వెంట ఆయుధాలు కలిగిన 15-20 మంది ఉన్నారని, వేగంగా మూడు వాహనాల్లో రైతులు నిరసన చేస్తున్న బన్బీర్పూర్కు ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు చేరుకున్నారని అందులో పేర్కొన్నారు. మహీంద్రా థార్ వాహనం ఎడమ వైపు కూర్చొన్న మోను మిశ్రా తుపాకీతో కాల్పులు జరిపాడని, దీంతో రైతులు చెల్లాచెదురుకాగా వారిపైకి వాహానాన్ని దూకించారని ఎఫ్ఐఆర్లో ఆరోపించారు.
ఆదివారం లఖింపూర్ ఖేరీలో కేంద్ర మంత్రి అజయ్ మిశ్రా పాల్గొన్న కార్యక్రమాన్ని వ్యతిరేకిస్తూ రోడ్డు పక్కన నిరసన తెలుపుతున్న రైతులపైకి ఆయన కాన్వాయ్‌లోని వాహనం దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు రైతులు మరణించగా, అనంతరం జరిగిన ఆందోళనలో మరో ఇద్దరు రైతులు, ఒక జర్నలిస్ట్, మరో ముగ్గురు కలిపి మొత్తం 8 మంది చనిపోయారు.
రైతులపైకి దూసుకెళ్లి వారిని తొక్కించిన వాహనంలో కేంద్ర మంత్రి కుమారుడు ఆశిష్ మిశ్రా ఉన్నాడని రైతు సంఘాలు ఆరోపించాయి. అయితే ఆ సమయంలో తన కుమారుడు ఆ వాహనంలో లేడని కేంద్ర మంత్రి అజయ్ మిశ్రాతోపాటు ఆయన కుమారుడు ఆశిష్ మిశ్రా మీడియాకు తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. 4 రోజుల్లోనే రూ.500 కోట్లకు చేరువలో వసూళ్లు!
Sarojini Devi Eye Hospital | దీపావళి ఎఫెక్ట్.. సరోజిని దవాఖానకు క్యూకట్టిన బాధితులు
Nvidia CEO Jensen Huang: ఎన్విడియా సీఈవో జేన్సన్పై దర్యాప్తు.. షాక్‌లో టెకీ ప్రపంచం
Fire accidents | పండుగ పూట హైదరాబాద్‌లో వరుస అగ్ని ప్రమాదాలు..! భయాందోళనలో జనం : వీడియో
Ramayana | ‘రామాయణ’ కంటే ‘ఆదిపురుష్’ విజువల్స్ బెటరా.. గ్రాఫిక్స్ విషయంలో ప్రభాస్ సినిమాకే ఎక్కువ మార్కులు!
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

