చండీగఢ్: సోషల్ మీడియా రీల్ కోసం పోలీస్ భార్య ప్రయత్నించింది. రోడ్డు మధ్యలో డ్యాన్స్ చేసింది. (Police Wife Dance on Road) దీని కోసం ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందిపడ్డారు. ఇది పోలీస్ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ నేపథ్యంలో ఆ పోలీస్‌ను సస్పెండ్ చేశారు. కేంద్ర పాలిత ప్రాంతమైన చండీగఢ్‌లో ఈ సంఘటన జరిగింది. మార్చి 20న చండీగఢ్‌లోని సెక్టార్ 20 రోడ్డు మధ్యలో పోలీస్ కానిస్టేబుల్ భార్య జ్యోతి డ్యాన్స్ చేసింది. సోషల్ మీడియాలో రీల్ కోసం వీడియో రికార్డ్ చేసింది. హర్యానీ పాటకు ఆమె డ్యాన్స్ కోసం ట్రాఫిక్‌ను నిలిపివేశారు. దీంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.
కాగా, పోలీస్ కానిస్టేబుల్ అజయ్ కుందు భార్య డ్యాన్స్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో ట్రాఫిక్‌కు ఇబ్బంది కలిగించేలా రోడ్డు మధ్యలో ఆమె డ్యాన్స్ చేయడంపై పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో డ్యాన్స్ చేసిన జ్యోతి, రికార్డ్ చేసిన ఆమె బంధువైన పూజపై చండీగఢ్ పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు పోలీస్ కానిస్టేబుల్ అజయ్ ఇన్స్టాగ్రామ్ నుంచి డ్యాన్స్ రీల్‌ను ఆయన భార్య పోస్ట్ చేయడంపై కూడా అధికారులు చర్యలు చేపడ్డారు. సెక్టార్ 19 పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న పోలీస్ కానిస్టేబుల్ అజయ్‌ను సస్పెండ్ చేశారు.
चंडीगढ़ : पत्नी ने सड़क पर लगाए ठुमके तो पति पुलिस से हुआ सस्पेंड
◆ महिला ने चंडीगढ़ में सैक्टर-20 की सड़क पर रील बनाने के लिए डांस कर ट्रैफिक जाम किया #Chandigarh | Chandigarh Police pic.twitter.com/jHNSedYpjf
— News24 (@news24tvchannel) March 31, 2025