కరోనావేళ భారత్ వ్యాక్సిన్ హబ్గా నిలిచింది.. ఐక్యరాజ్యసమితి సాధారణసభలో ప్రధాని ప్రసంగం
PM adress in UNGA: గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలు కరోనా మహమ్మారితో సతమతమవుతున్నాయని, గత వందేండ్లలో ఇలాంటి మహమ్మారి విజృంభించడం ఇదే తొలిసారని ప్రధాని నరేంద్రమోదీ

న్యూయార్క్: గడిచిన ఏడాదిన్నర కాలంగా ప్రపంచదేశాలు కరోనా మహమ్మారితో సతమతమవుతున్నాయని, గత వందేండ్లలో ఇలాంటి మహమ్మారి విజృంభించడం ఇదే తొలిసారని ప్రధాని నరేంద్రమోదీ పేర్కొన్నారు. ఈ కరోనా మహమ్మారి బారినపడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి ఒక్కరికి నివాళులు అర్పిస్తున్నానని, వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఐక్యరాజ్యసమితి సాధారణసభ 76వ సెషన్లో ప్రసంగిస్తూ ప్రధాని కరోనా మహమ్మారి ప్రస్తావన చేశారు.
ఈ ఏడాది ఆగస్టు 15న తాము 75వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకున్నామని, మా దేశంలోని విభిన్నత్వమే మా బలమైన ప్రజాస్వామ్యానికి గుర్తు అని ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. కరోనా వేళ భారత్ వ్యాక్సిన్ హబ్గా నిలిచిందన్నారు. అదేవిధంగా ప్రపంచంలోని వ్యాక్సిన్ తయారీదారులందరినీ భారత్లో వ్యాక్సిన్ల తయారీకి ముందుకు రావాలని ఆహ్వానించారు. ప్రపంచంలోనే మొట్టమొదటి డీఎన్ఏ వ్యాక్సిన్ను భారత్ తయారు చేసిందని చెప్పారు. 12 ఏండ్ల వయసు దాటిన ఎవరికైనా ఈ వ్యాక్సిన్ ఇవ్వవచ్చని చెప్పారు.
ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ కూడా తుది దశలో ఉన్నదన్నారు. భారత శాస్త్రవేత్తలు ముక్కు ద్వారా వేసే వ్యాక్సిన్లను కూడా అభివృద్ధి చేస్తున్నారని ప్రధాని చెప్పారు. కరోనా సమయంలోనూ భారత్లో మూడు కోట్ల మందికి ఇండ్లు కట్టిచ్చామన్నారు. భారత్లో అభివృద్ధితో ప్రపంచం అభివృద్ధిలోనూ వేగం పెరిగిందని చెప్పారు. దేశంలో ఆరు లక్షల గ్రామాలను డ్రోన్ మ్యాపింగ్ చేశామని, అంతేగాక పలు డిజిటల్ సంస్కరణలు చేపడుతున్నామని ప్రధాని చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
France Protests | తీవ్ర ఉద్రిక్తంగా ఫ్రాన్స్ నిరసనలు.. 143 ఏళ్ల నాటి చారిత్రక భవనానికి నిప్పు..!
Jagadish Reddy | రాష్ట్రంలో పాలన చేతకాక చేతులెత్తేసిన కాంగ్రెస్ : మాజీ మంత్రి జగదీష్ రెడ్డి
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Hair Fall | జుట్టు రాలడానికి వారం క్రితం వచ్చిన మార్పులే కారణమా.. నిపుణులు ఏమంటున్నారు..?
Tugboat | సముద్ర జలాల్లో టగ్బోట్పై దాడి.. UKMTO వెల్లడి
ట్రెండింగ్ వార్తలు
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!

