PM Modi | కలాం ఆలోచనలు యువతకు స్ఫూర్తిదాయకం.. మిస్సైల్ మ్యాన్‌కు మోదీ నివాళి..!
PM Modi | మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలా వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. కలాం గొప్ప శాస్త్రవేత్త, మార్గదర్శి, నిజమైన దేశభక్తుడని ప్రధాని పేర్కొన్నారు.
PM Modi | మిస్సైల్ మ్యాన్, భారత మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలా వర్ధంతి సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఆయనకు నివాళులర్పించారు. కలాం గొప్ప శాస్త్రవేత్త, మార్గదర్శి, నిజమైన దేశభక్తుడని ప్రధాని పేర్కొన్నారు. ఆయన ఆలోచనలు ఇప్పటికీ దేశంలోని యువతకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తాయన్నారు. బలమైన, అభివృద్ధి చెందిన భారత్‌ను నిర్మించడానికి దోహదపడేలా వారిని ప్రోత్సహిస్తాయన్నారు. ఈ మేరకు సోషల్ మీడియా ‘ఎక్స్’ వేదికగా పోస్టు పెట్టారు. ఆయనను స్ఫూర్తిదాయకమైన దార్శనికుడని, జాతి పట్ల ఆయన అంకితభావం ఆదర్శప్రాయమైందన్నారు.
డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం 2002 నుంచి 2007 వరకు భారతదేశ 11వ రాష్ట్రపతిగా పనిచేశారు. రాజకీయ పార్టీలు, సాధారణ ప్రజల నుంచి అపారమైన గౌరవం పొందిన దేశాధ్యక్షుల్లో ఆయన ఒకరు. ఆయన సాధారణ జీవితాన్ని గడిపారు. శాస్త్రవేత్తగా ఆయన భారతదేశ రక్షణ పరిశోధన, మిస్సైల్ కార్యక్రమాలను కొత్త శిఖరాలను తీసుకెళ్లారు. డాక్టర్ కలాం ఆలోచనలను యువతకు మార్గదర్శకంగా నిలుస్తాయని ప్రధాని మోదీ పేర్కొన్నారు. కలాం ఆలోచనలు, జీవిత తత్వశాస్త్రం దేశంలోని యువత మెరుగైన పౌరులుగా మార్చేందుకు, జాతి నిర్మాణంలో పాల్గొనేందుకు నిరంతరం ప్రేరణగా నిలుస్తాయన్నారు. 2020 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా మారాలనేది కలాం కల అని, ఆ దిశగా ముందుకు సాగడం మన కర్తవ్యమని కూడా మోదీ అన్నారు. డాక్టర్ కలాం వర్ధంతి సందర్భంగా యావత్ దేశం ఆయనకు నివాళులర్పిస్తున్నది. 2015 జులై 27న షిల్లాంగ్‌లో ఉపన్యాసం చేస్తూ ఆయన ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ప్లంబర్ విమానాన్ని దించగలడా?
కశ్మీర్ బస్సులపై రెండ్రోజుల్లో రెండు దాడులు
Elon Musk | అమెరికాలో ప్రతి చిన్నారికి SpaceX షేర్ ఇస్తా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన!
Akhilesh Yadav | బీజేపీ కుట్రపూరితంగా విపక్షాలను ఓట్లను తొలగిస్తున్నది : అఖిలేష్ యాదవ్
Dasoju Sravan | ఎల్‌నినో సంక్షోభం ప్రకృతి వైపరిత్యం కాదు.. కాంగ్రెస్ ప్రభుత్వ అసమర్థతే.. 23 ప్రశ్నలతో దాసోజు శ్రవణ్ బహిరంగ లేఖ
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

