Pinak Mishra | రత్న భాండాగారం తలుపులు తెరవగానే సొమ్మసిల్లి పడిపోయిన పూరి జిల్లా ఎస్పీ..!
Pinak Mishra | పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తెరుచుకున్నాయి. అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు.
Pinak Mishra : పూరీ జగన్నాథుడి ఆలయంలోని రత్న భాండాగారం తలుపులు ఎట్టకేలకు ఆదివారం మధ్యాహ్నం తెరుచుకున్నాయి. అయితే తలుపులను తెరువగానే పూరి జిల్లా ఎస్పీ పినాక్ మిశ్రా గదిలో సొమ్మసిల్లి పడిపోయారు. దాంతో ఆయనను ఆలయ పరిసరాల్లో ఏర్పాటు చేసిన హెల్త్ క్యాంప్కు తరలించారు. అక్కడ డాక్టర్ సీబీకే మహంతి ఆయనకు చికిత్స అందిస్తున్నారు. ఎస్పీ ఆరోగ్య పరిస్థితికి సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
కాగా, దాదాపు 46 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఇవాళ రత్న భాండాగారం తలుపులను తెరిచారు. మొత్తం 11 మంది సిబ్బంది రంగంలోకి దిగి ఈ తలుపులు తెరిచే ప్రక్రియ చేపట్టారు. తలుపులు తెరిచే సందర్భంగా ఆలయంలో జగన్నాథుడి సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా అధికారులు ముందుగానే ఏర్పాట్లు చేశారు. ఈసారి రత్న భాండాగారంలోని చెక్క పెట్టెల్లో భద్రపర్చిన ఆభరణాల లెక్కింపు ప్రక్రియనంతా డిజిటలైజ్ చేయనున్నారు. నిధిని మరో చోటకు తరలించేందుకు కొత్తగా ఆరు భారీ చెక్క పెట్టెలను ఏర్పాటు చేశారు.
తలుపులు తెరిచేందుకు ఒడిశా హైకోర్టు మాజీ జడ్జి బిశ్వనాథ్ రథ్, శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ చీఫ్ అడ్మినిస్ట్రేటర్ అరబింద పాధీతోపాటు ASI సూపరింటెండెంట్ లోపలికి వెళ్లారు. వీళ్లతోపాటు నలుగురు ఆలయ సహాయకులు కూడా వెళ్లినట్టు అధికారులు వెల్లడించారు. ఈ భాండాగారం తలుపులు తెరిచే ముందు ‘ఆజ్ఞ’ పేరుతో ప్రత్యేక పూజా కార్యక్రమం నిర్వహించారు. డిజిటల్ డాక్యుమెంటేషన్ తర్వాత లోపలి నిధిని వేరేచోటుకు తరలించనున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Madhya Pradesh | మధ్యప్రదేశ్లో భక్తులపై దూసుకెళ్లిన భారీ ట్రక్కు 12 మంది మృతి.. పలువురికి తీవ్ర గాయాలు
Bigg Boss 10 | బిగ్బాస్లో షాలినికి నాగార్జున క్లాస్.. రోహిత్, అమన్లకు షాక్.. వచ్చే వారం కెప్టెన్సీకి నో!
Dasara Safety Tips | దసరాకు ఊరెళ్తున్నారా జాగ్రత్త..! గ్రేటర్లో దొంగల కలకలం
Rain | తెలంగాణలో మూడు రోజులు వానలు!
NTR | నెల్సన్ దర్శకత్వంలో రాక్..? ఎన్టీఆర్ను కలిసి కథ చెప్పిన నెల్సన్ దిలీప్కుమార్
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

