భౌతికదూరం ప్రాధాన్యం.. జార్ఖండ్ పిల్లల ప్రయోగం!

కరోనాకు అడ్డుకట్ట వేయడానికి భౌతికదూరం పాటించటం ఎంత ముఖ్యమో చెప్పడానికి శనివారం కేంద్ర ఆరోగ్యశాఖ ఓ వీడియోను విడుదల చేసింది. జార్ఖండ్‌లోని ఓ గ్రామానికి చెందిన పిల్లలు ఈ వీడియోను రూపొందించడం విశేషం. భౌతికదూరం ప్రాధాన్యాన్ని చెప్పడంలో భాగంగా పిల్లలు.. కొన్ని ఇటుకలను ఒకదాని పక్కన ఒకటి (కిందపడితే మరో ఇటుకను తాకే విధంగా) నిలబెట్టారు. ఒక ఇటుకను పడేస్తే అది మరో ఇటుకను తాకి, అది మరో ఇటుకను ఇలా అన్ని ఇటుకలు పడిపోయాయి. మరోసారి ఇటుకలను అలాగే నిలబెట్టి ముందు ఉన్న ఇటుకను నెట్టారు. అది తగలటం వల్ల దానితర్వాత ఉన్న ఇటుకలు కూడా పడటం ప్రారంభమైంది. అయితే, ఒక పిల్లవాడు ఆ వరుసలో ఉన్న ఓ ఇటుకను తొలగించాడు. దీంతో దానికి ముందున్న ఇటుక పడినా కూడా.. పక్క ఇటుకపై పడనంత దూరం ఉంది. దీనివల్ల, తర్వాత ఇటుకలు ఏవీ పడకుండా అలాగే నిల్చున్నాయి. భౌతిక దూరం పాటిస్తే వైరస్ వ్యాప్తి కూడా ఒక స్థాయి వరకే పరిమితం అవుతుందని చెప్పడం కోసం ఆ గ్రామీణ చిన్నారులు ఈ సులువైన ప్రయోగం చేసి చూపించారు. ఈ వీడియోను కేంద్రం కరోనాపై అవగాహన కల్పించడం కోసం విడుదల చేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Naresh | రాజకీయాల వల్ల ఆస్తులు అమ్ముకోవాల్సి వచ్చింది.. చేదు అనుభవాలను పంచుకున్న నటుడు నరేష్
Asian Para Games: జావెలిన్ త్రోలో వరల్డ్ రికార్డు బ్రేక్ చేసిన హనే
Hanumakonda | మూడేండ్లయినా ముచ్చట లేదు.. ఊసే లేని హనుమకొండ కొత్త బస్ స్టేషన్ నిర్మాణం
Kalvala Project | ‘కల్వల’పై పట్టింపేది?.. కాంగ్రెస్ పాలనలో ప్రాజెక్టుపై నిర్లక్ష్యం.. మూడేళ్లయినా మరమ్మతులు శూన్యం
Sandeep Kumar: 400మీటర్ల స్ప్రింట్‌లో వరల్డ్ రికార్డు.. సందీప్ కుమార్‌కు స్వర్ణ పతకం
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

