PM Modi: కర్నాటక ప్రజలు తేరుకుని.. ఎన్డీఏకు మద్దతు ఇచ్చారు: ప్రధాని మోదీ
PM Modi: కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోదించారని ప్రధాని మోదీ అన్నారు.
న్యూఢిల్లీ: దక్షిణ భారతంలో ఎన్డీఏ కూటమి కొత్త రాజకీయాలకు తెరలేపిందని ప్రధాని మోదీ(PM Modi) అన్నారు. ఢిల్లీలో జరిగిన ఎన్డీఏ కూటమి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. కర్నాటక, తెలంగాణ రాష్ట్రాల్లో ఇటీవల కొత్త ప్రభుత్వాలు ఏర్పడ్డాయని, కానీ ఆ రాష్ట్రాల ప్రజలకు ఆ ప్రభుత్వాలతో బంధం తెగిపోయిందని, వాళ్లు భ్రమ నుంచి త్వరగా బయటకు వచ్చి, ఎన్డీఏను ఆమోదించారని ఆయన అన్నారు. తమిళనాడు కోసం పని చేసిన బృందాన్ని కూడా ఆయన అభినందించారు. తమిళనాడులో ఒక్క సీటు కూడా గెలవమన్న విషయం అందరూ చెప్పారని, కానీ తాము మాత్రం కలిసికట్టుగా పోరాడినట్లు వెల్లడించారు. తమిళనాడులో సీట్లు గెలవకున్నా.. అక్కడ మాత్రం ఎన్డీఏ ఓట్ షేర్ అమాంతంగా పెరిగిందన్నారు. ఇది స్పష్టమైన సందేశం ఇస్తోందని, రేపటి రోజు ఏం రాసి ఉందో చెబుతోందన్నారు. కేరళలో వందలాది మంది కార్యకర్తలు బలయ్యారని, కశ్మీర్ కన్నా ఎక్కువ సంఖ్యలో ఇక్కడ ప్రాణాలు కోల్పోయారని, కానీ తొలిసారి ఆ రాష్ట్రంలో తమ పార్టీ ఓ సీటుకు ప్రాతినిధ్యం వహిస్తోందని ప్రధాని మోదీ తెలిపారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- karnataka
- NDA
- NDA meeting
- Pm Modi
RELATED ARTICLES
తాజా వార్తలు
Bhargav Desh Pande | రేవంత్ రెడ్డి చుట్టున్న నలుగురు తప్ప ఎవరూ బాగుపడలేదు : మాజీ NSUI స్టేట్ ప్రెసిడెంట్ భార్గవ్ దేశ్ పాండే
KAAKA | చిరంజీవి ‘కాకా’లో బాలీవుడ్ స్టార్ హీరో .. కీలక పాత్రపై ఆసక్తికర చర్చ!
Mann Ki Baat | ‘మన్ కీ బాత్’ కు 12 ఏళ్లు పూర్తి.. అదొక తీర్థయాత్ర లాంటిదన్న ప్రధాని మోదీ..!
Alias Rukmini | నితిన్ ‘అలియాస్ రుక్మిణి’ నుంచి ఫస్ట్ సింగిల్ అప్డేట్!
Rapido Driver | కానిస్టేబుల్ చెవిని కొరికిన ర్యాపిడో డ్రైవర్.. వీడియో
ట్రెండింగ్ వార్తలు
Amur Falcons | ఏకంగా 23 దేశాలను చుట్టి మణిపూర్‌కు తిరిగొచ్చిన అమూర్ ఫాల్కన్స్..!
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం

