యూపీ కాంగ్రెస్ చీఫ్, కార్యకర్తలు అరెస్ట్

లక్నో: ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ, పలువురు పార్టీ నేతలతోపాటు కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. కేంద్ర ప్రభుత్వాన్ని కుదిపేస్తున్న పెగాసస్ స్పైవేర్ అంశంపై న్యాయ విచారణ జరిపించాలని యూపీ కాంగ్రెస్ డిమాండ్ చేసింది. దీనిపై గవర్నర్‌కు వినతి పత్రం సమర్పించేందుకు కాంగ్రెస్ నేతలు గురువారం పాదయాత్రగా రాజ్‌భవన్‌కు బయలుదేరారు. ఉదయం గృహ నిర్బంధంలో ఉన్న యూపీ కాంగ్రెస్ చీఫ్ అజయ్ కుమార్ లల్లూ కూడా ఇందులో పాల్గొన్నారు.
మరోవైపు కాంగ్రెస్ నేతలను పోలీసులు అడ్డుకునేందుకు ప్రయత్నించారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు, కార్యకర్తలు పోలీసుల మధ్య ఘర్షణ జరిగింది. దీంతో యూపీ కాంగ్రెస్ అధ్యక్షుడు అజయ్ కుమార్ లల్లూ, పలువురు నేతలతోపాటు కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేసి వ్యాన్‌లోకి ఎక్కించి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Tharun Bhascker | ప్రదీప్ రంగనాథన్ నిర్మాతగా తరుణ్ భాస్కర్ క్రేజీ ఎంటర్టైనర్!
America | అమెరికాలో గుండెపోటుతో ఖమ్మం యువతి మృతి
Prabhas | ప్రభాస్ బర్త్‌డే స్పెషల్.. ‘స్పిరిట్’ సెట్స్ నుంచి సందీప్ రెడ్డి వంగా సర్ప్రైజ్ పోస్ట్
Haiku Movie | ‘హైకూ’ మూవీ రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ ఎమోషన్స్‌తో ఆకట్టుకునే జెన్ జీ ప్రేమకథ!
వేయిస్తంభాల గుడి సుందరీకరణకు ప్రజలు సహకరించాలి : మున్సిపల్ కమిషనర్ వెంకన్న
ట్రెండింగ్ వార్తలు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత

