ఆలస్యంగా వచ్చినా పరీక్ష రాయనివ్వాలి
పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను కూడా ప్రవేశ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోరే అభ్యర్థులకు ఊరట కల్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సంస్కరణలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది.
- ఎన్టీఏ సంస్కరణలపై పార్లమెంటరీ కమిటీ సూచన
న్యూఢిల్లీ : పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చే అభ్యర్థులను కూడా ప్రవేశ పరీక్షలు రాసేందుకు అనుమతించాలని, ప్రొఫెషనల్ కోర్సుల్లో ప్రవేశం కోరే అభ్యర్థులకు ఊరట కల్పించాలని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సంస్కరణలపై ఏర్పాటైన పార్లమెంటరీ కమిటీ సిఫార్సు చేసింది. అయితే పరీక్షా కేంద్రాలకు ఆలస్యంగా వచ్చిన అభ్యర్థులను మిగిలిన సమాయానికి మాత్రమే పరీక్షరాసేందుకు అనుమతించాలని, ఎట్టి పరిస్థితుల్లోనూ అదనపు సమయం ఇవ్వకూడదని పేర్కొంది.
అభ్యర్థి పరీక్షా కేంద్రానికి చేరుకునేందుకు కొన్ని వాస్తవమైన, సహేతుకమైన కారణాలు ఉండవచ్చని ప్యానల్ పేర్కొంది. ఇలాంటి అభ్యర్థులు తమ ఆలస్యపు రాకను నమోదు చేస్తూ, ఒక హామీపత్రంపై సంతకం చేసిన తర్వాతే వారిని పరీక్షా హాలులోకి అనుమతించే యంత్రాంగాన్ని అభివృద్ధి చేయాలని సిఫార్సు చేసింది. పరీక్షల రోజుల్లో ఊరేగింపులు, బహిరంగ ర్యాలీలను నిషేధించాలని, ట్రాఫిక్, శాంతిభద్రతల ఏర్పాట్లను పక్కగా అమలు చేయాలని పార్లమెంటరీ ప్యానెల్ పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
iPhone Theft | ఫాస్ట్‌గా పాస్‌కోడ్ చెప్పు.. ఐఫోన్ కొట్టేసి ఓనర్ సిస్టర్‌కే మెసేజ్ పంపిన దొంగ!
Viral News | ఉద్యోగులకు బాస్ బంపర్ ఆఫర్.. ఏకంగా బీఎండబ్ల్యూ కారు గిఫ్ట్!
Watch: మంచంపై పడుకుని పూజారితో బొట్టుపెట్టించుకున్న ఎమ్మెల్యే.. వీడియో వైరల్
Extortion Trap | ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన మహిళను కలిసిన బ్యాంక్ మేనేజర్.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: భార్య, ఆమె ప్రియుడిపై భర్త కాల్పులు.. తర్వాత ఏం జరిగిందంటే?

