ఆసుపత్రి పాలైన… బెంగాల్ హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు
కోల్‌కతా: పశ్చిమ బెంగాల్లో సంచలనం రేపిన హత్యాచార బాధితురాలి తల్లిదండ్రులు ఆసుపత్రి పాలయ్యారు. నదియా జిల్లాకు చెందిన 14 ఏండ్ల బాలికపై స్థానిక తృణమూల్ కాంగ్రెస్ నేత కుమారుడు లైంగికదాడికి పాల్పడి హత్య చేసినట్లు ఆరోపణలున్నాయి. ఈ ఘటన నేపథ్యంలో ఆమె తల్లిదండ్రులు చాలా కుంగిపోయారు. ఆహారం సరిగా తీసుకోకపోవడం వల్ల అస్వస్థతకు గురయ్యారు. బాధిత బాలిక తల్లి కొన్ని రోజులుగా జ్వరంతో బాధపడుతున్నదని స్థానికులు తెలిపారు. ఆమె తండ్రి కూడా డీహైడ్రేషన్ వల్ల అస్వస్థతకు గురైనట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో బుధవారం వారిద్దరిని అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలించారు.
కాగా, ఈ నెల 5న స్థానిక పంచాయతీ టీఎంసీ నేత సమర్ గోలా కుమారుడు, 21 ఏండ్ల బ్రజ్ గోపాల్ గోలా పుట్టిన రోజు వేడుకకు వెళ్లిన బాలికపై లైంగికదాడి జరిగింది. ఆ మరునాడు ఆమె మరణించింది. అయితే టీఎంసీ నేత ఒత్తిడి వల్ల తమ కుమార్తె మృతదేహానికి పోస్ట్‌మార్టం నిర్వహించకుండానే అంత్యక్రియలు నిర్వహించారని మృతురాలి తల్లిదండ్రులు ఆరోపించారు. తన కుమార్తె, టీఎంసీ కుమారుడి మధ్య ప్రేమ వ్యవహారం ఉందన్న బాలిక తండ్రి ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అయితే ఘటన జరిగిన ఐదు రోజుల తర్వాత ఈ నెల 10న పోలీసులు కేసు నమోదు చేశారు.
మరోవైపు బెంగాల్లో సంచలనం రేపిన ఈ కేసును సీబీఐ దర్యాప్తునకు కోల్‌కతా హైకోర్డు మంగళవారం అప్పగించింది. బాధిత బాలిక కుటుంబానికి, సాక్షులకు తగిన భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అలాగే కేసు దర్యాప్తులో పోలీసుల నిర్లక్ష్యంపై చీవాట్లు పెట్టింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Bigg Boss 10 | బిగ్ బాస్‌లో ఈ వారం ఎలిమినేషన్ లేదా.. దీపావళి స్పెషల్‌గా నాగార్జున భారీ ట్విస్ట్
Ramayana | బాక్సాఫీస్ వద్ద ‘రామాయణ’ ప్రభంజనం.. మూడు రోజుల్లోనే రూ.375 కోట్లకు పైగా వసూళ్లు!
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

