పేలిన ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్.. మహిళ మృతి

జైపూర్: ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ పేలడంతో రాజస్థాన్‌లోని గంగాపూర్ నగరంలో ఓ మహిళ మృతి చెందింది. ఈ ఘటనలో ఆమె భర్తకు తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో కొవిడ్ నుంచి కోలుకున్న పేషెంట్ కోసం ఈ కాన్సన్ట్రేటర్ వాడుతున్నారు. శనివారం ఉదయం దానిని ఆన్ చేయడానికి వెళ్లగా అది పేలింది. అప్పటికే అందులో నుంచి ఆక్సిజన్ లీక్ కావడంతో స్విచ్ ఆన్ చేయగానే మంటలు చెలరేగాయి. ఐఏఎస్ ఆఫీసర్ హర్ సహాయ్ మీనా సోదరుడు సుల్తాన్ సింగ్ ఇంట్లో ఈ ఘటన జరిగింది. సుల్తాన్ సింగ్ రెండు నెలలుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు ఈ కాన్సన్ట్రేటర్ను అరేంజ్ చేశారు.
ఆయన భార్య సంతోష్ మీనా ఈ ప్రమాదంలో మృతి చెందింది. కాన్సన్ట్రేటర్ పేలడంతో రూమంతా మంటలు వ్యాపించాయి. ఈ పేలుడు విన్న పొరిగింటి వాళ్లు వెళ్లి చూడగా.. భార్యభర్తలు ఇద్దరూ తీవ్ర గాయాలతో పడి ఉండటం కనిపించింది. ఇద్దరూ హాస్పిటల్‌కు తరలిస్తుండా.. సంతోష్ మీనా మధ్యలోనే మృతి చెందింది. సుల్తాన్ సింగ్‌ను జైపూర్‌కు తరలించారు. ఈ ఘటన జరిగిన సమయంలో వాళ్ల ఇద్దరు పిల్లలు ఇంట్లో లేకపోవడంతో వాళ్లు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Son of Kanakadurgamma | ‘సన్ ఆఫ్ కనకదుర్గమ్మ’ చిత్రం నుంచి అమ్మవారిగా నటి లయ పవర్ఫుల్ పోస్టర్ విడుదల
Manchu Manoj | పోతరాజు నేపథ్యంలో మంచు మనోజ్ హీరోగా RPA క్రియేషన్స్‌లో భారీ డివైన్ యాక్షన్ థ్రిల్లర్
Health Tips | మనలోని కొన్ని అలవాట్లే మోకాళ్ల నొప్పులకు దారితీస్తాయ్.. అవేంటో తెలుసా..?
Jagadish Reddy | సూర్యాపేటలో మతసామరస్యానికి ప్రతీకగా సామూహిక విందు.. జగదీష్ రెడ్డి ఆత్మీయ పలకరింపు
Nishad Kumar | చరిత్ర సృష్టించిన నిషద్ కుమార్.. నిన్న లాంగ్ జంప్, ఇవాళ హైజంప్‌లో గోల్డ్‌మెడల్
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

