భయం గుప్పిట మణిపూర్
తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు సర్కారు తెలిపింది.
- ఘర్షణల్లో ఇప్పటి వరకు 70 మంది మృతి
- మిజోరంలో 7 వేల మందికి ఆశ్రయం
- 10 వేల మంది సైనికులతో భద్రత
ఇంఫాల్, మే 23: తాజా అల్లర్ల నేపథ్యంలో భయం గుప్పిట చిక్కుకున్న మణిపూర్‌లో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. మంగళవారం రాష్ట్రంలో వ్యాపార సముదాయాలు తెరుచుకోలేదు. ప్రజలు ఇండ్లలోనే ఉండాలని భద్రతా దళాలు సూచించాయి. రాష్ట్రమంతటా ఇంటర్నెట్ సేవలు నిలిపేశారు. కొద్ది గంటల సడలింపుతో కర్యూ కొనసాగిస్తున్నారు. శాంతి భద్రతల కోసం 10 వేల మంది సైనికులను రాష్ట్రమంతటా మోహరించినట్టు సర్కారు తెలిపింది. సోమవారం జరిగిన హింసకు సంబంధించి మాజీ ఎమ్మెల్యేతో పాటు ఇద్దరిని అరెస్టు చేసినట్టు సీఎం బిరేన్ సింగ్ వెల్లడించారు. లైనెన్స్ కలిగిన తుపాకులతో కొందరు స్థానికులు వారి ప్రాంతాల్లో కాపలా కాశారు. మరోవైపు మణిపూర్ పరిస్థితిపై రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ స్పందించారు. మత రాజకీయాలు ప్రజలను రాజకీయంగా ప్రభావితం చేస్తాయని ట్వీట్ చేశారు. మత రాజకీయాలనే వైరస్ వ్యాప్తి చెందితే జరిగే పరిణామాలను ఊహించలేమన్నారు. దాని వల్ల కలిగే ఫలితాలు తాత్కాలికమని, కానీ అవి శాశ్వతంగా భయపెడతాయని ఆయన అన్నారు.
మైతీ తెగ దాడులతో కుకీ ప్రజల్లో ఆందోళన!
మైతీ తెగ దుండగులు చర్చిలపైనా దాడులు చేస్తున్నారని కుకీ స్టూడెంట్స్ ఆర్గనైజేషన్‌కు చెందిన ఖంగ్సాయ్ ఆరోపించారు. ఆయన ‘ది వైర్’తో మాట్లాడుతూ రాష్ట్రంలో హింస కారణంగా ఇప్పటివరకు సుమారు 7 వేల మంది ప్రజలు మిజోరంలో ఆశ్రయం పొందుతున్నారన్నారు. వీరిలో ఎక్కువ శాతం కుకీ తెగ ప్రజలేనన్నారు. తాజా అల్లర్లలో ప్రస్తుత రాజ్యసభ ఎంపీ లేశంబా సునాజాఓబా ప్రమేయం ఉన్నదని ఖంగ్సాయ్ ఆరోపించారు. అరంబై తెంగ్గోల్ అనే మైతీ వలంటీర్ గ్రూప్ గ్రామాల్లో 20పైకి ఇండ్లకు నిప్పు పెట్టిందని ఆయన ఫిర్యాదు చేశారు. ఈ గ్రూప్ సభ్యుల నియామకాన్ని ఎంపీ లేశంబానే చేపట్టారని వెల్లడించారు. మిజోరం జనాభాలో 53 శాతంగా ఉన్న మైతీ ప్రజలు తమకు షెడ్యూల్ తెగ హోదా కావాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే పర్వత ప్రాంతాల్లోని నాగా, కుకీ తెగల ప్రజలు ఈ డిమాండ్‌ను వ్యతిరేకిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
కేసీఆర్ మళ్లీ సీఎం కావాలంటూ యువకుడి పాదయాత్ర.. మార్గమధ్యలో కలిసి అభినందించిన ఆల వెంకటేశ్వర్ రెడ్డి!
Bigg Boss 10 | ఈ వారం ఎలిమినేషన్ డేంజర్లో ఆ నలుగురు.. టాప్‌లో వంశీ, రోహిత్!
Mouni Roy | గ్లామర్ డోస్ పెంచిన మౌనీ రాయ్.. రెడ్ డ్రెస్‌లో అందాల విందు!
King | ‘కింగ్’ ఓవర్సీస్ హక్కులు రూ.175 కోట్లు.. భారతీయ సినిమా చరిత్రలోనే సరికొత్త రికార్డు!
మద్యం తాగేందుకు వెళ్లి.. విద్యుదాఘాతంతో ఇద్దరు ఇంజినీరింగ్ విద్యార్థులు మృతి
ట్రెండింగ్ వార్తలు
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి

