మరో మైళురాయి.. 40 కోట్ల మందికి కరోనా వ్యాక్సినేషన్
కరోనా వ్యాక్సినేషన్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి వ్యాకినేషన్ చేశామని వెల్లడించింది.

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక్షల మందికి వ్యాకినేషన్ చేశామని వెల్లడించింది. వారిలో 21,18,682 మంది 18 నుంచి 44 ఏండ్ల మధ్య వయస్కులకు మొదటి డోసు, 2,33,019 మందికి రెండో డోసు పంపిణీ చేశామని పేర్కొన్నది. దేశంలో ఇప్పటివరకు 40,44,67,526 మందికి వ్యాక్సినేషన్ చేశామని వెల్లడించింది.
భారత్ ప్రపంచంలోనే అతిపెద్ద వ్యాక్సినేషన్ కార్యక్రమం ప్రారంభించి ఇప్పటికి ఆరు నెలలు పూర్తైంది. కానీ ఇప్పటివరకూ దేశ జనాభాలో కేవలం దాదాపు ఆరు శాతం మంది ప్రజలకే రెండు డోసుల వ్యాక్సిన్ లభించింది. దేశంలో ప్రస్తుతం రోజుకు సగటున 40 లక్షల మందికి టీకాలు వేస్తున్నారు. కాగా, ఈ ఏడాది చివరి నాటికి 70 శాతం మంది ప్రజలకు టీకా వేయాలన్న లక్ష్యాన్ని అందుకోవాలంటే రోజూ 85 లక్షల నుంచి 90 లక్షల మందికి వ్యాక్సిన్ వేయాల్సి ఉంటుంది.
జనవరిలో ప్రారంభమైన ఈ వ్యాక్సినేషన్ కార్యక్రమం టీకా డోసుల సరఫరా తగ్గిపోయి, కొత్త వ్యాక్సీన్లకు అనుమతులు లభించడం ఆలస్యం కావడంతో కొన్ని నెలలపాటు మందకొడిగా సాగింది. ప్రస్తుతం ఒక డోసు వేసుకున్న వారు జనాభాలో 17 శాతం మంది వరకు ఉన్నారు.
ఆగస్టు నుంచి డిసెంబర్ మధ్య 135 కోట్ల డోసులు అందుబాటులో ఉంటాయని కేంద్రప్రభుత్వం సుప్రీంకోర్టుకు చెప్పింది. దేశంలో 18 ఏండ్లు పైబడిన అందరికీ వ్యాక్సిన్ వేయాలంటే ప్రభుత్వానికి 180 కోట్ల డోసులు అవసరమవుతాయి.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kalki 2 | కమల్ హాసన్ బర్త్‌డే స్పెషల్.. ‘కల్కి 2’లో యాస్కిన్ విశ్వరూపం!
Bala Krsihna | బాలయ్యతో కొరటాల శివ భారీ ప్రాజెక్ట్.. పొలిటికల్ డ్రామాతో పాటు ఫ్యామిలీ ఎమోషన్స్!
Modi | ట్రంప్‌తో దోస్తీకి నెలకు 2 కోట్లు..! లాబీయింగ్ సంస్థలకు చెల్లిస్తున్న మోదీ సర్కార్
Mamata Banerjee | నా మీదుగా బుల్డోజర్ నడపండి బీజేపీకి మమతా బెనర్జీ సవాల్!
TPS | టీపీఎస్ కోసం సర్కారీ స్కూళ్ల మూత..! విద్యాశాఖ ఆదేశాలపై సర్వత్రా ఆందోళన
ట్రెండింగ్ వార్తలు
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video

