Sikkim | సిక్కింలో కుంభవృష్టి.. ఆకస్మిక వరదతలో చిక్కుకుపోయిన 2 వేలమందికిపైగా పర్యాటకులు
Sikkim | గ్యాంగ్టక్: సిక్కింలో (Sikkim) కుంభవృష్టిగా వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు (Flash Flood) పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు (Stranded). వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు (Foreign tourists) కూడా ఉన్నారు.
Sikkim | గ్యాంగ్టక్: సిక్కింలో (Sikkim) కుంభవృష్టిగా వర్షం (Heavy Rain) కురుస్తున్నది. దీంతో ఆకస్మిక వరదలు (Flash Flood) పోటెత్తడంతో 2 వేలకుపైగా పర్యాటకులు (Tourists) చిక్కుకుపోయారు (Stranded). వారిలో దేశీయ పర్యటకులతోపాటు విదేశీయులు (Foreign tourists) కూడా ఉన్నారు. గురువారం నుంచి ఉత్తర సిక్కింలోని మంగాన్ జిల్లాలో భారీ వర్షం కురుస్తున్నది. దీంతో పెంగాంగ్ సప్లయ్ ఖోలా వద్ద మంగాన్ జిల్లా కేంద్రం నుంచి చుంగ్థాంగ్ వెళ్లే రోడ్డును వరద ముంచెత్తింది. దీనివల్ల రోడ్డు కోతకు గురవడంతో లెచెన్, లచుంగ్ ప్రాంతాల్లో ప్రకృతి అందాలను చూడటానికి వచ్చిన పర్యాటకులు అక్కడి హోటళ్లలోనే చిక్కుకుపోయారని అధికారులు తెలిపారు.
వారిలో 1975 మంది దేశీయ పర్యాటకులుగా, 36 మంది విదేశీయులు ఉన్నారని వెల్లడించారు. విదేశీయుల్లో 23 మంది బంగ్లాదేశీయులు, మరో పది మంది అమెరికా, ముగ్గురు సింగపూర్కు చెందినవారని చెప్పారు. అదేవిధంగా 345 కార్లు, 11 బైకులు బురుదలో కూరుకుపోయాయన్నారు. వరదలు ఆగిన తర్వాత రోడ్డుకు మరమ్మతులు చేస్తామని వెల్లడించారు.

Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kolkata stampede | కోల్కతా దుర్గా మండపంలో తొక్కిసలాట.. 19 మంది మృతి.. 25 మందికి గాయాలు
Kolkata Stampede | కోల్కతా తొక్కిసలాట.. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షల ఆర్థికసాయం, ప్రభుత్వ ఉద్యోగం..!
KTR | తెలంగాణ ఆడపడుచులకు కేటీఆర్ సద్దుల బతుకమ్మ శుభాకాంక్షలు.. అస్తిత్వ సౌరభమే బతుకమ్మ!
Prabhas | ‘రణబాలి’ మిక్స్డ్ టాక్.. ‘ఫౌజీ’తోనైనా ప్రభాస్ కొత్త ట్రెండ్ సృష్టిస్తారా?
Dorothy OTT | ఓటీటీలోకి కీర్తి సురేష్ ‘డోరతి’.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

