PM Modi: ఉగ్రవాదుల్ని మా సైనికులు అణిచివేస్తారు.. పాకిస్థాన్‌కు వార్నింగ్ ఇచ్చిన ప్రధాని మోదీ
PM Modi: గత చరిత్ర నుంచి పాకిస్థాన్ ఎటువంటి పాఠాలు నేర్చుకోలేదని ప్రధాని మోదీ అన్నారు. ఆ దేశం పొరపాటు చేసిన ప్రతిసారి ఓటమి పాలైందన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా నివాళి అర్పించిన మోదీ మాట్లాడారు. ఉగ్రవాదుల్ని దేశ సైనికులు అణిచివేస్తారన్నారు. శత్రువుకు గట్టి సమాధానం ఇవ్వనున్నట్లు వెల్లడించారు.
లడాఖ్: పొరుగు దేశం పాకిస్థాన్‌కు ప్రధాని మోదీ(PM Modi) వార్నింగ్ ఇచ్చారు. ఇవాళ 25వ కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా ద్రాస్ సెక్టార్లో జరిగిన కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. పాకిస్థాన్ నేరాలకు పాల్పడి గతంలో విఫలం అయ్యిందని, కానీ ఆ చరిత్ర నుంచి ఆ దేశం ఏమీ నేర్చుకోలేదని ప్రధాని మోదీ పేర్కొన్నారు. ఉగ్రవాదం, ప్రచ్ఛన్న యుద్ధంతోనే ఆ దేశం జీవనం చేస్తోందని విమర్శించారు. తాను మాట్లాడే ప్రదేశం నుంచి ఉగ్రదాడులకు పాల్పడుతున్న ముఠా నేతలు తన స్వరాన్ని నేరుగా వింటారని, ఉగ్రవాదానికి ఊతం ఇస్తున్న దేశాలకు ఓ విషయాన్ని చెప్పదలుచుకున్నానని, ఆ దేశ కుంచిత ఆలోచనలు ఎన్నటికీ విజయవంతం కావు అని ప్రధాని తెలిపారు. పూర్తి స్థాయి దళాలతో ఉగ్రవాదుల్ని మా సైనికులు అణిచివేస్తారని, శత్రువుకు బలమైన సమాధానం ఇస్తామని ప్రధాని మోదీ పేర్కొన్నారు.
#WATCH | Ladakh: PM Narendra Modi says, “Pakistan has failed in all its nefarious attempts in the past. But Pakistan has not learned anything from its history. It is trying to keep itself relevant with the help of terrorism and proxy war. Today I am speaking from a place where… pic.twitter.com/HQbzjcVKVq
— ANI (@ANI) July 26, 2024
లడాఖ్ అయినా, జమ్మూకశ్మీర్ అయినా, అభివృద్ధికి అడ్డు వచ్చే ఎటువంటి సవాల్‌ను అయినా ఇండియా ఓడిస్తుందని మోదీ అన్నారు. ఆర్టికల్ 370ని రద్దు చేసి ఆగస్టు 5వ తేదీ నాటికి అయిదేళ్లు అవుతుందని, జమ్మూకశ్మీర్ ప్రజలు కొత్త భవిష్యత్తు, కొత్త కలల గురించి మాట్లాడుకుంటున్నారని తెలిపారు. మౌళిక సదుపాయాల అభివృద్ధి, పర్యాటక రంగం.. లడాఖ్, జేకేలో వేగంగా వృద్ధి చెందుతోందన్నారు. కశ్మీర్లో కొన్ని దశాబ్ధాల తర్వాత సినిమా హాల్‌ను ఓపెన్ చేసినట్లు చెప్పారు. 35 ఏళ్ల తర్వాత శ్రీనగర్‌లో తాజియా ఊరేగింపు జరిగిందన్నారు.
#WATCH | PM Narendra Modi says, "…Agnipath scheme is also an example of the necessary reforms done by the Army…Some people used to think that the Army means saluting politicians, doing parades but for us, Army means the faith of 140 crore countrymen. The goal of Agnipath is… pic.twitter.com/oF3ZV7Fnp8
— ANI (@ANI) July 26, 2024
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం
Watch: చర్చిలో మరణం గురించి మాట్లాడిన ఫాదర్.. ఆయన తలపై సిలువ పడటంతో మృతి
Samsung Galaxy F70 5G | రూ.17,999కే శాంసంగ్ 5జీ ఫోన్.. 50MP కెమెరా, 5000mAh బ్యాటరీతో వచ్చేసింది!
Black Deer | కుర్సియాంగ్ అడవుల్లో మరో నల్లజింక ప్రత్యక్షం.. పరవశించిన పర్యాటకులు..!
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!

