Coin Stuck In Boy’s Throat | బాలుడి గొంతులో ఇరుక్కున్న నాణెం.. ఏడేళ్ల తర్వాత తొలగింపు
Coin Stuck In Boy’s Throat | ఒక బాలుడి గొంతులో రూపాయి నాణెం ఇరుక్కుంది. అయితే ఏడేళ్ల తర్వాత దీనిని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ ద్వారా ఆ కాయిన్‌ను బయటకు తీశారు.
లక్నో: ఒక బాలుడి గొంతులో రూపాయి నాణెం ఇరుక్కుంది. అయితే ఏడేళ్ల తర్వాత దీనిని డాక్టర్లు గుర్తించారు. సర్జరీ ద్వారా ఆ కాయిన్‌ను బయటకు తీశారు. (Coin Stuck In Boy’s Throat) ఉత్తరప్రదేశ్ బఘౌలీలోని మురళీపూర్వ గ్రామానికి చెందిన 12 ఏళ్ల అన్కుల్ ఈ ఏడాది ఏప్రిల్‌లో కడుపు నొప్పితో బాధపడ్డాడు. కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స అందించడంతో కోలుకున్నాడు.
కాగా, జూన్ 4న గొంతులో నొప్పిగా ఉందని ఆ బాలుడు తన కుటుంబానికి చెప్పాడు. తాత వెంటనే హర్దోయ్ జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లాడు. ఎక్స్ రే తీయగా రూపాయి నాణెం గొంతులో ఇరుక్కున్నట్లు ఈఎన్టీ సర్జన్ డాక్టర్ వివేక్ సింగ్ గుర్తించారు. ఆహార గొట్టం వద్ద చిక్కుకున్న ఆ నాణెన్ని టెలిస్కోప్ సర్జరీ విధానం ద్వారా బయటకు తీశారు.

Coin Stuck In Throat Of Boy
మరోవైపు ఏడేళ్ల కిందట ఐదేళ్ల వయసులో రూపాయి నాణేన్ని ఆ బాలుడు మింగినట్లు డాక్టర్ వివేక్ సింగ్ తెలిపారు. ఆహార గొట్టంలో ఒక పక్కగా నాణెం చిక్కుకోవడంతో ఆ బాలుడికి ఎలాంటి ఇబ్బంది కలుగలేదని చెప్పారు. నల్లగా మారుతున్న ఆ నాణెం వల్ల నెలన్నర కిందట బాలుడికి కామెర్లు వచ్చాయని అన్నారు.
కాగా, బాలుడి గొంతులో ఏడేళ్లుగా నాణెం ఇరుక్కుపోవడం చాలా అరుదైన కేసు అని డాక్టర్ వివేక్ సింగ్ తెలిపారు. సర్జరీ ద్వారా తొలగించిన తర్వాత అనేక సమస్యలు వచ్చే అవకాశం చాలా ఎక్కువని అన్నారు. ఈ నేపథ్యంలో బాలుడ్ని తరచుగా వైద్యపరీక్షలకు తీసుకురావాలని అతడి కుటుంబానికి సూచించినట్లు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Dragon | ఎన్టీఆర్ ‘డ్రాగన్’లో భారీ సాంగ్.. రామోజీ ఫిల్మ్ సిటీలో ప్రత్యేక సెట్, ఫ్లాష్బ్యాక్పై ఆసక్తికరమైన టాక్!
Heavy rain | చెన్నైలో వర్ష బీభత్సం.. పలు జిల్లాలకు ‘ఆరెంజ్ అలర్ట్’
Bigg Boss 10 | బిగ్‌బాస్ తెలుగు 10లో అదిరిపోయే ట్విస్ట్.. షాలిని ఎలిమినేట్ అంటూ సీక్రెట్ రూమ్‌లోకి!
NRI | ఐర్లాండ్‌లో ఘనంగా బతుకమ్మ వేడుకలు
RTC bus | ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. 15 మందికి గాయాలు : వీడియో
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

