ముంబైలో మరో నిర్భయ

- 34 ఏండ్ల మహిళపై లైంగిక దాడి
- మర్మావయవాల్లో ఇనుపరాడ్డు.. కత్తి పోట్లు.. బాధితురాలు మృతి
ముంబై, సెప్టెంబర్ 11: ముంబైలో ఘో రం జరిగింది. శుక్రవారం తెల్లవారుజామున సాకీనాకా ప్రాంతంలో 34 ఏండ్ల మహిళపై మానవ మృగం లైంగిక దాడికి పాల్పడింది. నిందితుడు బాధితురాలి మర్మాంగాల్లోకి ఇనుప రాడ్డు చొప్పించి కిరాతకంగా హింసించాడు. కత్తితో పొడిచాడు. ఆమె అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయాక పారిపోయాడు. 2012లో ఢిల్లీలో జరిగిన నిర్భయ ఘటనను తలపించిన ఈ ఘటన మహారాష్ట్రలో ప్రకంపనలు సృష్టించింది. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా అనుమానితుడు మోహన్ చౌహాన్‌ను (45) పోలీసులు అదుపులోకి తీసుకొన్నారు. కేసు దర్యాప్తునకు సిట్‌ను నియమించారు. ఘటనను మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రే తీవ్రంగా ఖండించారు. ఇది మానవత్వానికి మాయని మచ్చ అన్నారు. కేసు విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని తెలిపారు. నిందితునికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకొంటామన్నారు.
పోలీస్ కస్టడీకి నిందితుడు
శుక్రవారం ఉదయం 3.30 గంటలకు పోలీసులకు ఫోన్ రావడంతో వెంటనే సాకీనాకా పారిశ్రామిక ప్రాంతానికి వెళ్లారు. అక్కడ రోడ్డు పక్కన టెంపో వ్యాన్‌లో ఓ మహిళ రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో ఉన్నది. వెంటనే ఆమెను అదే టెంపోలో దవాఖానకు తరలించారు. టెంపో తాళం చెవిని అక్కడ ఉన్న వాచ్‌మ్యాన్ ఇచ్చినట్టు పోలీసులు తెలిపారు. బాధితురాలిని రాజవాడి దవాఖానకు తరలించారు. ఆమె చికిత్స పొందుతూ శనివారం చనిపోయారు. సీసీటీవీ కెమెరాల్లో ఫుటేజీ ఆధారంగా టెంపోను పార్క్ చేసిన మోహన్ చౌహాన్‌ను అదుపులోకి తీసుకొన్నారు. కోర్టులో హాజరుపరిచారు. అతనికి కోర్టు ఈ నెల 21 వరకు పోలీస్ కస్టడీ విధించింది. యూపీలోని జౌన్‌పూర్‌కు చెందిన మోహన్ డ్రైవర్‌గా పనిచేస్తున్నట్టు పేర్కొన్నారు.
భద్రత లేదు
లైంగిక దాడి ఘటనపై బీజేపీ మహారాష్ట్ర సర్కారుపై విమర్శలు గుప్పించింది. ముంబైలో మహిళలకు భద్రత లేదని ఆరోపించింది. నిందితుడికి ఉరిశిక్ష వేయాలని మహారాష్ట్ర మాజీ సీఎం, బీజేపీ నేత ఫడణవీస్ డిమాండ్ చేశారు. ఈ కేసును జాతీయ మహిళా కమిషన్ సుమోటోగా స్వీకరించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hanuman Ansh | ఓటీటీలోకి రూ.440 కోట్ల బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ తేదీ ఖరారు!
Revanth Reddy | రేవంత్‌ను కలిసిన ఆంధ్రా అభిమాని.. ఏపీకి నీళ్లు వదిలినందుకు కృతజ్ఞతగా వచ్చాడని సెటైర్లు
Voter List | తెలంగాణ ఓటర్లకు ఎన్నికల సంఘం మరో ఛాన్స్.. ఓటు కోసం ఈ తేదీలోగా దరఖాస్తు చేసుకోండి!
IND vs NZ 2nd ODI | వర్షం కారణంగా 47 ఓవర్ల మ్యాచ్.. టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న గిల్
Scene | తెలుగులో ‘సీన్’కు నిరాశాజనక ఆరంభం.. తొలి రోజు వసూళ్లు ఎంతంటే?
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

