వేడి రోజుల్లో దవాఖాన ముప్పు రెట్టింపు
మధుమేహం, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి మెటాబొలిక్ డిజార్డర్స్ ఉన్న రోగులు దవాఖానలో చేరవలసిన ముప్పు వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో రెట్టింపు అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలు గల రోజులతో పోల్చిపుడు ఈ పరిస్థితి కనిపిస్తున్నదని స్పెయిన్‌లో జరిగిన అధ్యయనం వెల్లడించింది.
న్యూఢిల్లీ: మధుమేహం, ఊబకాయం, హైపర్‌టెన్షన్ వంటి మెటాబొలిక్ డిజార్డర్స్ ఉన్న రోగులు దవాఖానలో చేరవలసిన ముప్పు వేడి ఎక్కువగా ఉండే రోజుల్లో రెట్టింపు అవుతుంది. సాధారణ ఉష్ణోగ్రతలు గల రోజులతో పోల్చిపుడు ఈ పరిస్థితి కనిపిస్తున్నదని స్పెయిన్‌లో జరిగిన అధ్యయనం వెల్లడించింది. ‘ఎన్విరాన్మెంటల్ హెల్త్ పెర్స్పెక్టివ్’ జర్నల్‌లో ప్రచురితమైన ఈ అధ్యయన నివేదిక ప్రకారం… ‘ఊబకాయం ఉన్నవారి శరీరంలోని కొవ్వు ఇన్సులేటర్‌గా పని చేస్తుంది. ఫలితంగా వీరికి హీట్ డిజార్డర్స్ వచ్చే అవకాశాలు మరింత పెరుగుతాయి. వీరు దవాఖానలో చేరాల్సిన పరిస్థితిని పెంచడంలో గాలి కాలుష్యం కూడా దోహదపడుతుంది. గాయాలు తగిలినపుడు దవాఖానలో చేరాల్సిన అవసరం పురుషులకు ఎక్కువగా ఉంటుంది.’ అని అధ్యయనం తెలిపింది. అంటువ్యాధులు, హార్మోనల్, మెటాబొలిక్ డిజార్డర్స్ గల మహిళలు దవాఖానలో చేరవలసిన అవసరం మరింత ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది. వేడి వల్ల ఒత్తిడి కలిగిన పరిస్థితుల్లో ఎక్కువ రక్తం చర్మం వద్దకు ప్రవహిస్తుంది. చెమట ఉత్పత్తి అవుతుంది. దీనికి ప్రతి చర్యలు వ్యక్తుల వయసు, స్త్రీ, పురుషుడు, పూర్వపు ఆరోగ్య పరిస్థితులు వంటివాటిని బట్టి వేర్వేరుగా ఉంటాయని విశ్లేషించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
సారపాకలో ముమ్మరంగా ఓటరు నమోదు
AP News | ఏపీకి మరో తుపాను ముప్పు.. భారీ వర్షాలు కురుస్తాయన్న ఐఎండీ
AP News | ఎన్నికల వేళ చంద్రబాబు సర్కారు దుర్మార్గాలు చేస్తోంది : పేర్ని నాని
కూలీలు ఉపాధి పనులను సద్వినియోగం చేసుకోవాలి: జడ్పీ సీఈవో నాగలక్ష్మి
‘టీఎస్ యూటీఎఫ్ నల్లగొండ జిల్లా మహాసభలను విజయవంతం చేయండి’
ట్రెండింగ్ వార్తలు
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం అర్జున్ ముండా వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం
Brothers Lifestyle Upgrade | సోదరుల జీవనశైలిలో ఆకస్మిక మార్పు.. ఇంట్లో దాచిన డ్రమ్ముల్లో కోట్లలో డబ్బు చూసి పోలీసులు షాక్
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!

