వరదల్లో మొరాయించిన బోటు.. మంత్రిని కాపాడిన రెస్క్యూ దళాలు

దాతియా: మధ్యప్రదేశ్ హోంమంత్రి నరోత్తమ్ మిశ్రాకు అనూహ్య పరిస్థితి ఎదురైంది. దతియా జిల్లాలో వరదల్లో చిక్కుకున్న వారిని రక్షించేందుకు రెస్క్యూ ఆపరేషన్ చేపట్టారు. ఆ ఆపరేషన్‌ను దగ్గర ఉండే నిర్వహించేందుకు మంత్రి ప్రత్యేక బోట్లో అక్కడికి వెళ్లారు. అయితే భారీగా వస్తున్న వరదల ధాటికి మంత్రి ఉన్న బోటుపై చెట్టు పడింది. దీంతో ఆ బోటు ఇంజిన్ ఫెయిలైంది. ఆ వరద నీటిలో చిక్కుకున్న మంత్రిని ప్రత్యేక రెస్క్యూ దళం కాపాడింది. ఎస్డీఆర్ఎఫ్ బోటులో సర్వేకు వెళ్లిన మంత్రికి చేదు అనుభవం ఎదురైంది. ఓ ఇంటి టెర్రెస్‌పై చిక్కుకున్న 9 మందిని రక్షించేందుకు చేపట్టిన ఆపరేషన్‌ను మంత్రి పర్యవేక్షించారు. అయితే తొలుత ఇంటిపై చిక్కుకున్న వారిని రక్షించారు. ఆ తర్వాత మంత్రిని ఎస్డీఆర్ఎఫ్ దళాలు ఎయిర్‌లిఫ్ట్ చేశాయి. ఈ ఘటనపై ఆ రాష్ట్ర కాంగ్రెస్ మండిపడింది. బీజేపీ చాలా ప్రమాదకరమైన స్టంట్లు చేస్తున్నట్లు ఆరోపించింది. స్పైడర్మ్యాన్లో నటించేందుకు హోంమంత్రి ప్రయత్నించారని, దాని వల్ల ఆయన ప్రాణాలకే ముప్పు అన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘మల్లేశ్వరి కుటుంబానికి న్యాయం చేయాలి’
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
‘రావులపల్లికి మంజూరైన ఆస్పత్రిని వేరే ఊరికి మార్చొద్దు’
Police Commissioner | బ్యాంకులు, ఏటీఎంల వద్ద పటిష్టమైన భద్రతా ప్రమాణాలు పాటించాలి : సీపీ పోలీస్ కమిషనర్
‘రైతులను పట్టించుకోని ప్రభుత్వం’
ట్రెండింగ్ వార్తలు
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?

