న్యూఢిల్లీ : కొవిడ్-19 కొత్త వేరియంట్ ఒమిక్రాన్ (B.1.1.529) వేరియంట్‌పై ఢిల్లీకి చెందిన ఎయిమ్స్ డైరెక్టర్ డాక్టర్ రణదీప్ గులేరియా ఆదివారం ఆందోళన వ్యక్తం చేశారు. కొత్త వైరస్ స్పైక్ ప్రోటీన్ ప్రాంతంలో 30కిపైగా మ్యుటేషన్లు ఉన్నాయని తెలిపారు. ఈ మ్యుటేషన్లు ప్రమాదకరంగా మారే అవకాశం ఉందన్నారు. స్పైక్ ప్రోటీన్లు దేహంలోకి వైరస్ ప్రవేశాన్ని సులభతరం చేస్తాయని, అలాగే ఇన్ఫెక్షన్ కలిగిస్తాయన్నారు.
మార్పులతో రోగ నిరోధక వ్యవస్థ నుంచి తప్పించుకుంటుందన్నారు. స్పైక్ ప్రోటీన్ శక్తిని తగ్గించేందుకు టీకాలో యాంటీబాడీలు ఉత్పత్తవుతాయన్నారు. స్పైక్ ప్రొటీన్లలో ముట్యేషన్లు పెరిగితే టీకా సామర్థ్యం తగ్గుతుందన్న ఎయిమ్స్ ఛీప్.. ఒమిక్రాన్‌పై ప్రస్తుత వ్యాక్సిన్ల సామర్థ్యం పరిశీలించాల్సి ఉందన్నారు.