ఇవేం వ్యాఖ్యలు? ఒమర్ అబ్దుల్లా ఫైర్
బుల్డోజర్ల ద్వారా ముస్లిం ఇళ్లను కూల్చేస్తున్నారని, ఈ సమయంలో కొందరు జర్నలిస్టులు విపరీత ధోరణితో మాట్లాడుతున్నారని నేషనల్ కాన్ఫరెన్స్ అధినేత ఒమర్ అబ్దుల్లా అభ్యంతరం వ్యక్తం చేశారు. అతి త్వరలో దేశంలో బుల్డోజర్ల కొరత రాబోతోందని, ఇతర దేశాల నుంచి దిగుమతులు చేసుకోవాల్సి వస్తుందంటూ టీవీ యాంకర్లు మాట్లాడుతున్నారని పేర్కొన్నారు. నిష్పక్షపాతంగా ఉండాల్సిన వారే, ఇంత పాక్షికంగా ఉండటం ఏంటని ఫైర్ అయ్యారు.
హిందీని జాతీయ భాష అంటూ వ్యాఖ్యానాలు వస్తున్న నేపథ్యంలో ఒమర్ స్పందించారు. భారత్ ఎంతో వైవిధ్యమైన దేశమని, అందరికీ స్థానం వుంటుందని పేర్కొన్నారు. భారతీయ కరెన్సీలో అన్ని భాషలకు స్థానం వుందని, దీన్ని బట్టే అర్థం చేసుకోవచ్చు అంటూ ఒమర్ పేర్కొన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

