Woman Biryani | మహిళను చంపి.. సూట్‌కేసులో శరీర భాగాలు కుక్కి.. మిగిలిన వాటితో బిర్యానీ!
Woman Biryani | ఆగ్రా రైల్వేస్టేషన్లో సూట్‌కేస్‌లో మహిళ శరీర భాగాలు లభించిన కేసును చెన్నై పోలీసులు ఛేదించారు. 350కిపైగా సీసీ కెమెరాలను పరిశీలించి అనుమానితుల ఇంటిని గుర్తించగా.. అక్కడ బిర్యానీ పాత్రలోనూ మానవ శరీర భాగాలు కనిపించాయి.
Woman Biryani | చెన్నై నుంచి దిల్లీ వెళ్తున్న రైలులో లభించిన ఓ సూట్ కేసులో మహిళ శరీర భాగాలు బయటపడిన కేసును పోలీసులు ఛేదించారు. ఆగ్రా రైల్వే స్టేషన్లో సూట్‌కేసు లభించగా.. అందులో లభించిన శరీర భాగాల మూలాలు చెన్నైలో దొరికాయి. 350కి పైగా సీసీ కెమెరాల ఫుటేజీలను జల్లెడ పట్టిన పోలీసులు.. చివరకు అనుమానితుల ఇంటిని కనుగొన్నారు. అక్కడకు వెళ్లి చూడగా పోలీసులకు భయానక దృశ్యాలు కనిపించాయి. మహిళ శరీరాన్ని ముక్కలుగా కోయడమే కాకుండా.. ఆనవాళ్లు లేకుండా చేసేందుకు వాటితో బిర్యానీ వండినట్లుగా గుర్తించి దిగ్భ్రాంతికి గురయ్యారు.
ఆగ్రాలో బయటపడిన సూట్‌కేస్ రహస్యం
ఈ నెల 5న చెన్నై నుంచి దిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వేస్టేషన్‌కు చేరుకుంది. ఓ జనరల్ కంపార్ట్మెంట్లో నుంచి తీవ్ర దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు తనిఖీ చేయగా అనుమానాస్పదంగా కనిపించిన ఎరుపు రంగు సూట్‌కేస్ కనిపించింది. దాన్ని తెరిచి చూడగా అందులో మహిళ మృతదేహానికి సంబంధించిన శరీర భాగాలు ఉండటంతో ఒక్కసారిగా కలకలం రేగింది. దర్యాప్తులో ఆ సూట్‌కేస్ చెన్నై నుంచే రైలులో పెట్టినట్లు గుర్తించారు. దీంతో ఆగ్రా పోలీసులు తమిళనాడు పోలీసులను సంప్రదించారు.
350కిపైగా సీసీ కెమెరాల పరిశీలన
కేసును ఛేదించేందుకు చెన్నై పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నై సెంట్రల్ రైల్వేస్టేషన్‌తో పాటు పరిసర ప్రాంతాల్లోని 350కిపైగా సీసీ కెమెరాల ఫుటేజీలను పరిశీలించారు. ఈ క్రమంలో ఓ పురుషుడు, ఓ మహిళ కలిసి ఎరుపు రంగు సూట్‌కేస్‌తో స్టేషన్‌కు వచ్చినట్లు గుర్తించారు. వారు సూట్‌కేస్‌ను తమిళనాడు ఎక్స్‌ప్రెస్‌లో ఉంచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. అనంతరం చెన్నై పార్క్ రైల్వేస్టేషన్ నుంచి సబర్బన్ రైలు ఎక్కి గూడువాంజేరి చేరుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
గూడువాంజేరి రైల్వేస్టేషన్ పరిసరాల్లోని సీసీ కెమెరాలను పరిశీలించగా.. అదే వ్యక్తులు సూట్‌కేస్‌తో ఓ ఆటోలో వెళ్తున్న దృశ్యాలు పోలీసులకు కనిపించాయి. ఆటోను అనుసరిస్తూ వెళ్లిన పోలీసులు గూడువాంజేరి మసీదు వీధిలో వారు నివసిస్తున్న ఇంటిని గుర్తించారు. ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా అక్కడ హత్య జరిగినట్లు అనుమానించే కీలక ఆధారాలు లభించాయి. గదుల్లో రక్తపు మరకలు కనిపించడంతో పోలీసుల అనుమానాలు మరింత బలపడ్డాయి.
బిర్యానీ పాత్రలోనూ మానవ శరీర భాగాలు!
పోలీసుల తనిఖీల్లో ఓ భారీ బిర్యానీ పాత్ర కనిపించింది. దానికి మూతపెట్టి చుట్టూ మైదాపిండి అతికించినట్లు గుర్తించారు. మూత తొలగించి చూడగా బియ్యంతో పాటు మానవ శరీరానికి సంబంధించిన ముక్కలు కనిపించడంతో పోలీసులు షాక్‌కు గురయ్యారు. హత్యకు గురైన మహిళ శరీరాన్ని ముక్కలు చేసిన తర్వాత.. కొన్ని భాగాలను సూట్‌కేస్‌లో పెట్టి రైలులో తరలించినట్లు, మిగిలిన భాగాలను వండుతూ ఆనవాళ్లు లేకుండా చేసేందుకు ప్రయత్నించినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. మృతురాలి తల మాత్రం ఇంకా లభించలేదు. దాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.
పోలీసుల దర్యాప్తులో మృతురాలిని ఒడిశాకు చెందిన హయాత్ నిషాగా గుర్తించారు. ఆమె భర్త నుంచి విడిపోయి చెన్నైలో ఉంటున్నట్లు తెలిసింది. ఆమె 19 ఏళ్ల కుమారుడు తాంబరం ప్రాంతంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిషాతో కలిసి మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్ నివసిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. వీరిద్దరూ నిషాకు బంధువులని చెప్పుకున్నట్లు పోలీసులు గుర్తించారు.
నిషాను లస్కర్ దంపతులు హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే హత్యకు అసలు కారణం ఏమిటన్నది ఇంకా స్పష్టంగా తెలియలేదు. డబ్బు, నగలు కోసం హత్య చేశారా? లేక మృతురాలికి, అనుమానితులకు మధ్య ఉన్న వ్యక్తిగత విభేదాలే కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు చేస్తున్నారు. మృతురాలి కుమారుడిని పోలీసులు విచారిస్తున్నారు. ఆమె ఎవరెవరితో సంబంధాలు కలిగి ఉంది? చివరిసారిగా ఎవరిని కలిసింది? అనుమానితులతో ఆమెకు ఉన్న సంబంధం ఏమిటి? తదితర అంశాలపై ఆరా తీస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Abhijeet Dipke | ‘ఇప్పుడు దేశమంతా జంతర్ మంతర్ అవుతుంది’.. నిరసన వేదిక గుర్తింపు రద్దుపై అభిజీత్ దిప్కే
సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌ను తొలగించాలని కేరళం అసెంబ్లీలో తీర్మానం
CJI Surya Kant: మీటింగ్ కుదరదు.. ఈ-ఫైలింగ్ చేయండి: ఖర్గే, రాహుల్‌కు సీజేఐ లేఖ
Harish Rao | కుప్పంలో కృష్ణానదీ జలాలు పారుతుంటే.. మరి నువ్వెందుకు నీళ్లు ఎత్తుతలేవు రేవంత్ రెడ్డి : హరీశ్ రావు
‘ప్రతి ఒక్కరు దైవ చింతన కలిగి ఉండాలి’
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

