భువనేశ్వర్: శ్రీరామ నవమి నేపథ్యంలో ఒడిశాకు చెందిన ఒక కళాకారుడు ప్రపంచంలోనే అతి చిన్న రాముడి విగ్రహాన్ని తయారు చేశారు. గంజాంకు చెందిన ఆర్టిస్ట్ సత్యనారాయణ మోహరానా చెక్కతో అతి చిన్న రాముడి విగ్రహాన్ని చెక్కారు. తాను తయారు చేసిన రాముడి విగ్రహం కేవలం 4.1 సెంటీమీటర్ల ఎత్తు మాత్రమే ఉన్నదని, ప్రపంచంలోనే అతి చిన్న రాముడి విగ్రహమని ఆయన తెలిపారు. ఈ ఏడాది శ్రీరామ నవమిని పురస్కరించుకుని దీనిని చెక్కినట్లు చెప్పారు.
కరోనా నేపథ్యంలో ప్రజలు ఆలయాలకు వెళ్లవద్దని కళాకారుడు సత్యనారాయణ అన్నారు. అంతా ఇండ్లలోనే ఉండి శ్రీరాముడ్ని భక్తితో ఆరాధించాలని ఆయన సూచించారు.