50 వేల మందికి టోకరా.. యూపీలో ఫేక్ ఉద్యోగాల నోటిఫికేషన్
డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుదీరిన ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల డొల్లతనాన్ని బయట పెట్టిన మోసమిది.
- రూ.కోట్లు కొల్లగొట్టిన మోసగాళ్లు
- యూపీ, ఏపీ, బెంగాల్ సహా ఆరు రాష్ర్టాల్లో బాధితులు
- గుర్తించలేకపోయిన యోగి ఆదిత్యనాథ్ సర్కారు
- గుట్టురట్టు చేసిన ఒడిశా పోలీసులు
హైదరాబాద్, జనవరి 5, స్పెషల్ టాస్క్ బ్యూరో, (నమస్తే తెలంగాణ) : డబుల్ ఇంజిన్ సర్కార్ కొలువుదీరిన ఉత్తరప్రదేశ్‌లో పోలీసుల డొల్లతనాన్ని బయట పెట్టిన మోసమిది. కేంద్ర ప్రభుత్వ పథకాలను పోలిన పేర్లతో నకిలీ వెబ్సైట్లను సృష్టించిన మోసగాళ్లు రెండేండ్లుగా దేశవ్యాప్తంగా 50 వేల మంది ఉద్యోగార్థులను మోసగించి కోట్లాది రూపాయలు కొల్లగొట్టారు. ఈ ఘరానా మోసాన్ని ఒడిశా పోలీసులు బయటపెట్టారు. బుల్డోజర్ న్యాయం, ఎన్కౌంటర్లపై ఎక్కువగా శ్రద్ధ పెట్టే యూపీలోని బీజేపీ సర్కారు ఇలాంటి మోసాలపై దృష్టి సారించకపోవడం గమనార్హం.
కేంద్ర పథకాలను పోలిన ఫేక్ వెబ్సైట్లు
ఒడిశా ఆర్థిక నేరాల విభాగం డీజీ జై నారాయణ్ పంకజ్ కథనం ప్రకారం, ఉత్తరప్రదేశ్ అలీగఢ్‌కు చెందిన ఇంజినీరింగ్ సాంకేతిక నిపుణుడు జఫర్ అహ్మద్(25), అతడి ముగ్గురు సోదరులు ఈ మోసానికి ఒడిగట్టారు. ‘జీవన్ స్వాస్థ సురక్ష యోజన’, ‘భారతీయ జనస్వాస్థ సురక్ష యోజన’, ‘గ్రామీణ సమాజ్ స్వాస్థ సేవా’ అనే కేంద్ర ప్రభుత్వ పథకాల పేర్లతో పోలికలు ఉండేలా మూడు నకిలీ వెబ్సైట్లను సృష్టించి దిన పత్రికల్లో ఉద్యోగ ప్రకటనలు ఇచ్చారు.
దరఖాస్తుదారులను నమ్మించడానికి 50 మందితో కాల్ సెంటర్లనూ ఏర్పాటు చేశారు. ఆన్లైన్లో దరఖాస్తుకు రిజిస్ట్రేషన్ రుసుముగా రూ. 3 వేలు, ఉద్యోగ శిక్షణ కోసం రూ.70 వేలు చెల్లించాలని నిబంధన పెట్టారు. రాజస్థాన్‌లో వందలాది నకిలీ బ్యాంక్ అకౌంట్లను తెరిచారు. ఆ ఖాతాలకు నిరుద్యోగులు చెల్లించిన డబ్బులను యూపీలోని ప్రభుత్వ జన్ సేవా కేంద్రాల్లో క్యూఆర్ కోడ్లను స్కాన్ చేయడం ద్వారా డ్రా చేసుకున్నారు. విత్ డ్రా చేసుకున్న నగదుపై జన్ సేవా కేంద్రాల నిర్వాహకులకు 10% కమీషన్ చెల్లించారు.
ఈ మోసానికి 1000 సిమ్‌లను, 530 మొబైల్ ఫోన్లను ఉపయోగించిన కేటుగాళ్లు ఆ తర్వాత వాటిని నదిలో పారేశారు. ఒడిశా పోలీసులకు అందిన ప్రాథమిక సమాచారం ప్రకారం గుజరాత్, కర్ణాటక, పశ్చిమ బెంగాల్, ఏపీ, ఒడిశా రాష్ర్టాలకు చెందిన నిరుద్యోగులు మోసపోయారు. ఈ మోసానికి సూత్రధారి అయిన జాఫర్ అహ్మద్‌కు కోర్టు 5 రోజుల రిమాండ్ విధించింది. నిరుద్యోగులను నిలువునా ముంచి కోట్లాది రూపాయాలు కొల్లగొట్టిన మోసగాళ్లు అలీగఢ్‌లో రూ.కోట్లు విలువ చేసే ఆస్తులను కొనుగోలు చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
- Tags
- Fake Jobs
- jobs notification
- UP
RELATED ARTICLES
తాజా వార్తలు
Wake Up Stroke | వేక్-అప్ స్ట్రోక్ అంటే ఏమిటి.. లక్షణాలు ఎలా ఉంటాయి.. ఏం చేయాలి..?
Dead Bodies | ప్రకాశం జిల్లాలో కలకలం..బీచ్‌కు కొట్టుకువచ్చిన నాలుగు మృతదేహాలు
Health tips | నోటి దుర్వాసన ఇబ్బంది పెడుతోందా.. అయితే ఉదయాన్నే ఈ పని చేయండి..!
Kodangal | కొడంగల్ ఎడ్యుకేషన్ హబ్‌లో వలస కూలీల తిరుగుబాటు.. నిర్మాణ సంస్థపై తీవ్ర ఆరోపణలు
Miss behave | బాలికకు బొమ్మలిస్తానని నమ్మించి అసభ్య ప్రవర్తన
ట్రెండింగ్ వార్తలు
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!
Watch: 8 ఏళ్ల బాలుడి దారుణం.. క్లాస్‌లో యూకేజీ బాలికపై రాయితో దాడి, చిన్నారి పరిస్థితి విషమం

