Inchal | పంతుళ్ల పల్లె.. ఆ గ్రామంలో ప్రతి ఇంట్లో ఓ ఉపాధ్యాయుడు
విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకేనేమో.. ఈ గ్రామంలో అందరూ విద్యావంతులే కాదు.. విద్య నేర్పేవారు ఇంటికొకరు ఉన్నారు. అందుకే ఈ గ్రామాన్ని ‘పంతుళ్ల పల్లె’ అని కూడా పిలుస్తుంటారు.
Inchal | బెంగళూరు, సెప్టెంబర్ 6: విద్య లేనివాడు వింత పశువు అన్నారు. అందుకేనేమో.. ఈ గ్రామంలో అందరూ విద్యావంతులే కాదు.. విద్య నేర్పేవారు ఇంటికొకరు ఉన్నారు. అందుకే ఈ గ్రామాన్ని ‘పంతుళ్ల పల్లె’ అని కూడా పిలుస్తుంటారు. ఇంచల్.. కర్ణాటకలోని బెళగావి జిల్లా సావడట్టి తాలూకాలోని ఓ గ్రామం. గ్రామ జనాభాలో పది శాతం అనగా 600 మంది ఉపాధ్యాయులు గ్రామంలోని దాదాపు ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధ్యాయ వృత్తిని తమ జీవనోపాధిగా ఎంచుకోవడం విశేషం. సిద్ధ సంస్థాన్‌కు చెందిన ఆధ్యాత్మిక గురువు డాక్టర్ శివానంద భారతి స్వామీజీ దూరదృష్టితో చేపట్టిన చర్యలే నేడు ఆ గ్రామంలో విద్యా కుసుమాలు పరిమళాలు వెదజల్లుతున్నాయి.
1970 దశకంలో ఆ గ్రామంలో ఒకే ఒక్క ప్రాథమిక పాఠశాల ఉండేది. ఇక్కడ ఉన్నత విద్యా సంస్థల ఆవశ్యకతను గుర్తించిన డాక్టర్ శివానంద భారతి మరికొందరు నిబద్ధతగల టీచర్లతో కలిసి ఓ విద్యా సొసైటీని స్థాపించారు. ఇక్కడ 1984లో గ్రామీణ ఉపాధ్యాయుల శిక్షణా కేంద్రం ఏర్పడింది. ఈ కేంద్రంలో ఇంచల్ గ్రామానికి చెందిన వారికి ఉచితంగా శిక్షణ, భోజనం సదుపాయం కల్పించారు. 1988 నుంచి సగటున ప్రతి ఏడాది ఇంచల్కు చెందిన 20 మంది ఉపాధ్యాయులు శిక్షణ పొందేవారు.
దేశ సేవలోనూ ముందంజ
దేశ ప్రజలను విద్యావంతులను చేయడం ఎంత ముఖ్యమో.. దేశ రక్షణ కూడా అంతే ప్రాధాన్యం గలదని ఇంచల్వాసులు గుర్తించారు. దీంతో చాలామంది యువకులు దేశ సైన్యంలో చేరేందుకు సిద్ధపడ్డారు. ఇంచల్ గ్రామానికి చెందిన 300 మందికిపైగా యువకులు నేడు దేశ త్రివిధ దళాల్లో సేవలందిస్తున్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Women’s Asian Champions Trophy | చైనాపై భారత్ ఘన విజయం.. ఆసియా హాకీ ఛాంపియన్‌గా హ్యాట్రిక్
Child Marriage | టెంకంపేట్లో బాల్యవివాహానికి బ్రేక్.. అధికారుల చొరవతో నిలిపివేత
Begumpet Students | సిద్దిపేట వైజ్ఞానిక ప్రదర్శనలో బేగంపేట విద్యార్థుల ప్రతిభ.. రాష్ట్రస్థాయికి స్మార్ట్ వాకర్ ప్రాజెక్టు
Myanmar military bombs school | స్కూల్‌పై మయన్మార్ ఆర్మీ బాంబు దాడి.. మహిళలు, పిల్లలతో సహా 30 మంది మృతి
ఓబీసీ కులగణన తర్వాతే డీలిమిటేషన్ చేపట్టాలి.. బీసీ మహిళలకు సబ్‌కోటా కల్పించాలి.. జాజుల శ్రీనివాస్ డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

