Law Commission | అలాచేస్తే బాల్యవివాహాలు, అక్రమ రవాణా అరికట్టడంపై ప్రతికూల ప్రభావం.. కేంద్రానికి లా కమిషన్ సూచన
లైంగిక కార్యకలాపాలకు పోక్సో చట్టం నిర్దేశిస్తున్న అంగీకార వయసును తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న ఈ అంగీకార వయసును 16 ఏండ్లకు తగ్గిచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది.
Law Commission | న్యూఢిల్లీ: లైంగిక కార్యకలాపాలకు పోక్సో చట్టం నిర్దేశిస్తున్న అంగీకార వయసును తగ్గించాలన్న వాదనను లా కమిషన్ వ్యతిరేకించింది. ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న ఈ అంగీకార వయసును 16 ఏండ్లకు తగ్గిచాలన్న ప్రతిపాదనపై కేంద్ర ప్రభుత్వానికి కీలక సూచనలు చేసింది. అంగీకార వయసును తగ్గిస్తే బాల్య వివాహాలను, బాలల అక్రమ రవాణాను అరికట్టడంపై ప్రత్యక్షంగా ప్రతికూల ప్రభావం పడుతుందని న్యాయ మంత్రిత్వ శాఖకు సమర్పించిన నివేదికలో హెచ్చరించింది. లైంగిక నేరాల నుంచి చిన్నారులకు రక్షణ కల్పించే పోక్సో చట్టం ప్రకారం 18 ఏండ్లలోపు బాలబాలికలతో శృంగార కార్యకలాపాలు జరపడం నేరం. వారి అంగీకారంతో చేసినా అది చట్టవిరుద్ధమే. దీంతో ఈ చట్టం ద్వారా యుక్తవయసులో ఉన్నవారి మధ్య సంబంధాన్ని నిర్వచించడంపై కొన్ని సందర్భాల్లో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో 16-18 ఏండ్ల వయసు ఉండి పరస్పర ఆమోదంతో కలయికలో పాల్గొన్నవారి కేసులను పరిష్కరించేందుకు వీలుగా న్యాయమూర్తులకు మార్గదర్శకాలతో కూడిన విచక్షణాధికారాలను కల్పించాలని లా కమిషన్ సూచించింది.
10 ఏండ్ల నుంచి 18 ఏండ్లకు..!
చట్టప్రకారం ప్రస్తుతం 18 ఏండ్లుగా ఉన్న శృంగార సమ్మతి వయసు.. 1860లో 10 ఏండ్లుగా ఉండేదని, తర్వాతి క్రమంలో పెరుగుతూ వచ్చింది. అప్పట్లో 11 ఏండ్లకే వివాహిత అయిన ఒక బాలిక మరణం తీవ్ర నిరసనలకు దారితీసింది. ఆమె భర్త బలవంతంగా లైంగిక చర్యలకు పాల్పడటంతో తీవ్ర రక్తస్రావమై ప్రాణాలు కోల్పోయింది. ఈ వ్యవహారంపై ప్రజాగ్రహం పెల్లుబికిన నేపథ్యంలో 1891లో సెక్షన్ 375 కింద శృంగార సమ్మతి వయసును 12 ఏండ్లకు పెంచారు. అనంతరం 1925లో 14 ఏండ్లకు, 1940లో 16 ఏండ్లకు మారింది. 2012లో పోక్సో చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత సమ్మతి వయసును 18 ఏండ్లకు పెంచినట్టు న్యాయ కమిషన్ నివేదికలో తెలిపింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
YS Jagan | ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికలపై సుప్రీం కోర్టుకు వెళ్తాం : వైఎస్ జగన్
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

