Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Supreme Court : హిందూ మతం నుంచి ఇతర మతాలకు మారితే రిజర్వేషన్ వర్తించబోదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది.
Supreme Court : హిందూ మతం నుంచి ఇతర మతాలకు మారితే రిజర్వేషన్ వర్తించబోదని సుప్రీంకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ విషయంలో ఇంతకుముందు మద్రాస్ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు సమర్ధించింది. మతం మారినప్పుడు హిందూయిజంలోని కులం ఆధారంగా దక్కాల్సిన రిజర్వేషన్ వర్తించబోదని స్పష్టం చేసింది. ఈ విషయంలో తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది.
హిందూ, బీసీ కేటగిరికి చెందిన వారు ఇస్లాంలోకి మారినప్పటికీ.. అంతకుముందు ఉన్న హిందూ, బీసీ కేటగిరిని అనుసరించి రిజర్వేషన్ వర్తిస్తుందని తమిళనాడు ప్రభుత్వం ఇచ్చిన ఆదేశాల్ని ఇంతకుముందే మద్రాస్ హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు ఈ తీర్పును సుప్రీంకోర్టు కూడా సమర్ధించింది. దీంతో హిందూ మతం నుంచి ఇతర మతాలలోకి మారితే.. వారి మునుపటి కులం ఆధారంగా రిజర్వేషన్ వర్తించబోదని వివరించింది. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్ ఆధ్వర్యంలోని ద్విసభ్య ధర్మాసనం ఈ నిర్ణయం వెల్లడించింది.
ఒక మతంలోని వెనుకబడిన కులంను ఆధారం చేసుకుని వర్తించే రిజర్వేషన్ హక్కు.. ఇతర మతాలలోకి మారితే వర్తించబోదని తీర్పు వెల్లడించింది. హిందువు కాని వారు.. హిందువుల్లోని బీసీ వర్గంలోని వ్యక్తిగా హక్కు కలిగి ఉండరని కోర్టు తెలిపింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలివి. తమిళనాడులోని తూత్తుకుడి జిల్లాకు చెందిన ఒక వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశాడు. అతడు హిందూ మతం, బీసీ సామాజిక వర్గానికి చెందినవాడు. అయితే, 2016లో ఒక ముస్లిం యువతిని ఇస్లాం సాంప్రదాయం ప్రకారం పెళ్లి చేసుకుని, ఇస్లాంలోకి మారిపోయాడు. తన పేరును కూడా సమీర్ అహ్మద్‌గా మార్చుకున్నాడు.
అంతకుముందు, 2015లోనే కయతార్ మండలానికి చెందిన సున్నాత్ జమాత్ అనే ముస్లిం సంస్థ.. అతడు ఇస్లాంలోకి మారినట్లు సర్టిఫికెట్ జారీ చేసింది. అంటే, 2016లో వివాహానికి ముందే అతడు ఇస్లాంలోకి మారిపోయాడు. ఇదే సమయంలో తాను ముస్లింనే అంటూ ముస్లిం లెబ్బాయ్ వర్గం నుంచి ఒక కమ్యూనిటీ సర్టిఫికెట్ కూడా తీసుకున్నాడు. అనంతరం సమీర్ అహ్మద్ బీసీ సర్టిఫికెట్ కోసం స్థానిక తహసీల్దార్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. అయితే, దీనికి ఆ తహసీల్దార్ నిరాకరించాడు. అతడు ముస్లిం కావడంతో బీసీ సర్టిఫికెట్ ఇవ్వలేదు.
దీంతో సమీర్ అహ్మద్ ఈ అంశంపై మద్రాస్ హైకోర్టును ఆశ్రయించాడు. ఈ విషయంలో గతంలో తమిళనాడు ప్రభుత్వం జారీ చేసిన ఆదేశాల్ని వివరించాడు. దీని ప్రకారం.. బీసీ, ఇతర వెనుకబడిన వర్గాల నుంచి ఇస్లాంలోకి మారినప్పటికీ బీసీ రిజర్వేషన్ పొందొచ్చు. అయితే, ప్రభుత్వ నిర్ణయాన్ని మద్రాస్ హైకోర్టు తప్పుబట్టింది. దీనిపై సుప్రీంకోర్టును ఆశ్రయించగా.. తాజా తీర్పు వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Supreme Court | హిందూయిజం నుంచి ఇస్లాంకు మారితే బీసీ రిజర్వేషన్ వర్తించదు.. సుప్రీంకోర్టు తీర్పు
Gajab Raat | ‘గజ్బ్ రాత్’గా మారిన మనోజ్ బాజ్‌పేయ్ ‘గుస్ఖోర్ పండట్’.. ట్రైలర్ విడుదల!
Zaheerabad AO | 14 ఏళ్ల కృషికి జాతీయ గుర్తింపు.. జాతీయ ఉత్తమ అధికారిగా లావణ్య
Stock Market | దూసుకెళ్లిన స్టాక్ మార్కెట్.. 1534 పాయింట్లు లాభపడ్డ సెన్సెక్స్.. ఒక్కరోజే 2 శాతంపైగా లాభం
Power Supply | విద్యుత్ సరఫరా అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

