Arvind Kejriwal | అరవింద్ కేజ్రీవాల్‌కు మళ్లీ నిరాశే.. పిటిషన్‌పై అత్యవసర విచారణకు ఢిల్లీ హైకోర్టు ‘నో’..!
Arvind Kejriwal | తన బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే.
Arvind Kejriwal | తన బెయిల్ పిటిషన్‌ను అత్యవసరంగా విచారించాలని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ చేసిన విజ్ఞప్తిని బుధవారం ఢిల్లీ హైకోర్టు తిరస్కరించింది. ట్రయల్ కోర్టు బెయిల్ ఆర్డర్‌ను సవాల్ చేస్తూ ఈడీ హైకోర్టును ఆశ్రయించగా.. మధ్యంతర స్టే విధించిన విషయం తెలిసిందే. ఈడీ పిటిషన్‌పై కేజ్రీవాల్ ఇచ్చిన సమాధానం అర్ధరాత్రి అందిందని.. దీనిపై కౌంటర్ దాఖలు చేసేందుకు సమయం కావాలని ఈడీ తరఫున అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు హైకోర్టుకు తెలిపారు. ఈ మేరకు జస్టిస్ నీనా బన్సల్ కృష్ణ కేసు విచారణను వాయిదా వేశారు. మంగళవారం రాత్రి 11 గంటలకు కేజ్రీవాల్ సమాధానానికి సంబంధించిన కాపీ ఇచ్చారని.. కౌంటర్ అఫిడవిట్ సిద్ధం చేసేందుకు సమయం లేదని ఏఎస్జీ తెలిపారు.
కేజ్రీవాల్ తరఫున సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు. మంగళవారం మధ్యాహ్నం ఒంటిగంటకు కాపీని ఇన్వెస్టిగేషన్ ఆఫీస్ (IO)కి పంపినట్లు సింఘ్వీ తెలిపారు. కేజ్రీవాల్‌కు మంజూరైన బెయిల్‌పై హైకోర్టు స్టే విధించిందని.. ఈ కేసు విచారణ అత్యవసరమని పేర్కొన్నారు. కేజ్రీవాల్ స్పందనపై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేసేందుకు ఈడీకి అర్హత ఉందని జస్టిస్ కృష్ణ వ్యాఖ్యానించారు. ఈ మేరకు కేసు విచారణను ఈ నెల 15వ తేదీకి వాయిదా వేశారు. ఢిల్లీ మద్యం పాలసీ కేసులో మార్చి 21న ఈడీ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. మద్యం పాలసీ కేసులో వచ్చిన సొమ్మును గోవా ఎన్నికలకు ఆమ్ ఆద్మీ పార్టీ ఉపయోగించిందని ఈడీ ఆరోపించింది.
ఆ పార్టీకి కన్వీనర్‌గా కేజ్రీవాల్ ఉన్నారని.. దీనికి ప్రధాన సూత్రధారి కేజ్రీవాల్ అని స్పష్టం చేసింది. అయితే, సాక్ష్యాధారాలను చూపడంలో.. సొత్తును రికవరీ చేయడంలో ఈడీ విఫలమైందని కేజ్రీవాల్ తరఫు న్యాయవాదులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రత్యేక కోర్టు కేజ్రీవాల్‌కు గత నెలలో బెయిల్ మంజూరు చేసింది. ఆ తర్వాత ఈడీ ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించడంతో మధ్యంతర స్టే విధించింది. జూన్ 26న సీబీఐ అరెస్ట్ చేయగా.. కోర్టు ఆయనను 29 వరకు సీబీఐ కస్టడీకి పంపింది. సీబీఐ అరెస్టును సవాల్ చేస్తూ పిటిషన్ దాఖలు చేయగా.. ప్రస్తుతం హైకోర్టులో పెండింగ్‌లో ఉన్నది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
అనధికారిక యూటర్న్‌తో ప్రమాదాలు
Rajnath Singh | ఈసారి తీవ్రవాద దాడి జరిగితే తీవ్రంగా స్పందిస్తాం.. పాకిస్తాన్‌కు రాజ్‌నాథ్ సింగ్ హెచ్చరిక
చికిత్స పేరుతో మహిళకు వేధింపులు.. వైద్యుడి అరెస్ట్
ACB Net | రూ.8వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డ తహసీల్దార్
Srilanka Cricket | ముక్కోణపు వన్డేలకు ఓపెనర్ దూరం.. అన్క్యాప్డ్ కుర్రాడికి భలే అవకాశం..!
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

