Rs 2000 Notes | రూ.2వేల నోట్ల మార్పిడి స్పష్టతనిచ్చిన ఎస్బీఐ..! ఎలాంటి ఫామ్ నింపాల్సిన అవసరం లేదంటూ..!
2,000 note exchange | రూ.2,000 నోట్ల మార్పిడి (2,000 Note Exchange) లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. అలాగే ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని ఆదివారం పేర్కొంది.
న్యూఢిల్లీ: రూ.2,000 నోట్ల మార్పిడి (2,000 Note Exchange) లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) తెలిపింది. అలాగే ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని ఆదివారం పేర్కొంది. ఈ మేరకు తన అన్ని శాఖలకు ఎస్బీఐ మార్గదర్శకాలు జారీ చేసింది. ఎలాంటి గుర్తింపు కార్డు లేదా ఫార్మ్ లేకుండా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేయవచ్చని లేదా మార్చుకోవచ్చని అందులో పేర్కొంది. బ్యాంకుల్లో రూ.2,000 నోట్లు డిపాజిట్ లేదా మార్పిడి కోసం ఆధార్ కార్డ్ వంటి గుర్తింపు పత్రాలు సమర్పించడంతోపాటు ఒక ఫార్మ్‌ను పూరించాల్సి ఉంటుందని సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాపిస్తున్నది. ఈ నేపథ్యంలో ఎస్బీఐ దీనిపై స్పందించింది. రూ.2,000 నోట్ల మార్పిడి లేదా బ్యాంక్ ఖాతాలో డిపాజిట్ కోసం ఎలాంటి ఐడీ ఫ్రూఫ్ అవసరం లేదని, ఏ విధమైన ఫార్మ్ లేదా స్లిప్ పూరించాల్సిన పని లేదని స్పష్టం చేసింది.
కాగా, రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు భారతీయ రిజర్వ్ బ్యాంక్ (ఆర్బీబీ) శుక్రవారం తెలిపింది. అయితే ప్రజలు ఆ నోట్లను బ్యాంకుల్లో మార్పిడి చేసుకోవచ్చని లేదా తమ బ్యాంకు ఖాతాల్లో డిపాజిట్ చేసుకోవచ్చని చెప్పింది. ఆర్బీఐకి చెందిన 19 ప్రాంతీయ కార్యాలయాలతోపాటు ఇతర బ్యాంకులు రూ.2,000 నోట్లను ఈ నెల 23 నుంచి స్వీకరిస్తాయని పేర్కొంది. బ్యాంకులో ఖాతా లేకపోయినా రూ.20,000 వరకు రూ.2,000 నోట్లను మార్పిడి చేసుకోవచ్చని స్పష్టం చేసింది. ఈ ఏడాది సెప్టెంబర్ 30 వరకు ఈ నోట్లను మార్పిడి లేదా డిపాజిట్ చేసుకోవచ్చని తెలిపింది. ‘క్లీన్ నోట్ పాలసీ’ కింద రూ.2,000 నోట్ల చెలామణిని నిలిపివేస్తున్నట్లు ఆర్బీఐ వెల్లడించింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

