తీపి కబురు చెప్పిన ముంబై మేయర్..

ముంబై : ముంబై వాసులకు స్థానిక మున్సిపాల్టీ తీపి కబురు చెప్పింది. కోవిడ్ ఉదృతి తగ్గే వరకు నగర ప్రజలకు ప్రాపర్టీ ట్యాక్సును పెంచడం లేదని మేయర్ కిషోరీ పడ్నేకర్ తెలిపారు. ఇవాళ ఆమె మీడియాతో మాట్లాడారు. కరోనా వైరస్ మూలంగా నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఆస్థిపన్నును పెంచడం లేదని ఆమె అన్నారు. పరిస్థితులు చక్కబడే వరకు ముంబై నగర ప్రజలపై అదనపు భారం మోపడం లేదన్నారు. నిజానికి ఇంటి పన్నును 14 శాతం పెంచనున్నట్లు ఊహాగానాలు వినిపించాయి. దీంతో నగర ప్రజలు హడలెత్తిపోయారు. ఇటీవల ఓ స్టాండింగ్ కమిటీ ఇచ్చిన నివేదిక ప్రజలను భయాందోళనలకు గురి చేసింది. ప్రాపర్టీ ట్యాక్సును దాదాపు 14 శాతం వరకు పెంచే అవకాశాలు ఉన్నట్లు అధికారులు చెప్పారు. ముంబైలో మొత్తం 4.2 లక్షల మంది ప్రాపర్టీ ఓనర్లు ఉన్నారు. దాంట్లో 1.37 లక్షల ఇండ్లు దాదాపు 500 గజాల్లో ఉన్నాయి. చివరిసారి 2015లో ఆస్థిపన్నును పెంచారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
‘ఇల్లెందు తాగునీటి సమస్యను పరిష్కరించాలి’
Gadapa Song | ‘ఇడుపు కాయితం’ నుంచి సెకండ్ సింగిల్ ‘గడప’ పాట విడుదల
Abhijeet Dipke | ఢిల్లీని కాదు.. చైనాతో సరిహద్దుల్ని కాపాడండి.. మోదీపై అభిజీత్ దీప్కే విమర్శలు
418 Movie | ‘418’ మూవీ రివ్యూ.. ప్రశాంత్ నీల్ హారర్ సినిమా భయపెట్టిందా?
Bomb Threat Mail: అమితాబచ్చన్ ఇళ్లు, ముంబై మేయర్ ఆఫీసుపై దాడి చేస్తాం: బెదిరింపు మెయిల్
ట్రెండింగ్ వార్తలు
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!
Watch: బెంచ్‌పై కూర్చొన్న కొందరు వ్యక్తులు.. వారి సమీపంలోని కుక్కను నోటకరుచుకెళ్లిన చిరుత
Watch: దసరా నాడు కొత్త కారు కొనుగోలు చేసిన వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?

