నల్లధనం ఎంతున్నదో తెలియదు: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్
- స్విస్బ్యాంకులో భారతీయుల డబ్బుపై అధికారిక వివరాల్లేవు..
- లోక్సభలో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటన
- గత నెలలోనే వివరాలు వెల్లడించిన స్విట్జరాండ్ సెంట్రల్ బ్యాంక్
- 2020తో పోల్చితే 2021లో 50శాతం నల్లధనం పెరిగినట్టు వెల్లడి
న్యూఢిల్లీ, జూలై 26: ‘మేం అధికారంలోకి వస్తే స్విస్బ్యాంకులో దాచిన నల్లధనాన్ని వెనక్కి తెస్తాం. దేశ ప్రజలందరికీ ఆ నగదుని పంచుతాం. ఒక్కొక్కరి ఖాతాలో 15లక్షల వరకు వేస్తాం’… 2014లో ఎన్నికల ప్రచారం సందర్భంగా నరేంద్రమోదీ ఇచ్చిన వాగ్దానమిది. కానీ, ఆయన ప్రధాని అయ్యాక ఆ విషయమే అటకెక్కించారు. దాని ప్రస్తావన కూడా మళ్లీ ఎక్కడా తేలేదు. స్విస్బ్యాంకులో భారతీయులు దాచుకున్న బ్లాక్మనీ రెట్టింపు అయ్యిందన్న వార్తలు వెలువడ్డాయి. స్విట్జర్లాండ్ సెంట్రల్బ్యాంకు విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. 2020లో భారతీయుల దాచుకున్న నల్లధనం రూ. 20,700 కోట్లు కాగా, 2021లో అది 30,533 కోట్లకు పెరిగింది. అంటే ఒక్క ఏడాదిలోనే స్విస్ బ్యాంకులో భారతీయుల బ్లాక్మనీ 50శాతం పెరిగిందన్నమాట.
అటు స్విట్జరాండ్ ప్రభుత్వమే అధికారికంగా ఈ గణాంకాలు వెల్లడిస్తుంటే.. తమ వద్ద మాత్రం స్విస్బ్యాంకులో నల్లధనం ఎంత ఉందన్న వివరాలేవీ లేవని కేంద్ర ఆర్థికమంత్రి ప్రకటించడం విస్మయపరుస్తున్నది. స్విస్ బ్యాంకుల్లో భారతీయులు, భారతీయ కంపెనీలు డిపాజిట్ చేసిన డబ్బుపై కచ్చితమైన అధికారిక వివరాలేవీ లేవని నిర్మలా సీతారామన్ స్పష్టంచేశారు. సోమవారం లోక్సభలో సభ్యులు అడిగిన ఒక ప్రశ్నకు ఆమె పైవిధంగా లిఖితపూర్వక సమాధానమిచ్చారు. 2020తో పోలిస్తే 2021లో స్విస్ బ్యాంకుల్లో భారతీయు డిపాజిట్లు పెరిగాయని, ఇటీవల కొన్ని మీడియా నివేదికలు పేర్కొన్నట్టు వెల్లడించారు. ఆ నిధులు భారతీయుల నల్లధనం అని కూడా నివేదికలు వెల్లడించలేదని తెలిపారు. విదేశాలకు నల్లధనం తరలకుండా నిరోధించేందుకు కేంద్రం పలు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నదని పేర్కొన్నారు. 29 విదేశీ ఆస్తుల దర్యాప్తు విభాగాలు ఇందుకోసం పనిచేస్తున్నాయని వెల్లడించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
BRS AUSTRALIA | వెలుగు పత్రిక తప్పుడు ప్రచారాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం : అనిల్ బైరెడ్డి
AP Muncipal Elections | ఈ నెల 28వ తేదీన ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలకు సెలవు!
Shakambari Devi | శాకాంబరీదేవిగా వేయిస్తంభాల రుద్రేశ్వరీదేవి దర్శనం
Harish Rao | రైతుకూలీల బిడ్డలు డాక్టర్లు కావడం గర్వకారణం : మాజీ మంత్రి హరీష్రావు
TGSRTC | పండుగ వేళ టికెట్ ఛార్జీల బాదుడు.. 2003 జీవో పేరుతో సమర్థించుకున్న టీజీఎస్ఆర్టీసీ!
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

