Bhagavad Gita | భగవద్గీతపై పేటెంట్ ఎవరికీ ఉండదు: ఢిల్లీ హైకోర్టు
మతగ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిలిం డైరెక్టర్ రమానంద్ సాగర్ తీసిన రామాయణ్ సీరియల్స్‌కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.
Bhagavad Gita | న్యూఢిల్లీ, అక్టోబర్ 2: మతగ్రంథాలపై పేటెంట్ ఎవరికీ ఉండదని, అయితే.. బీఆర్ చోప్రా తీసిన మహాభారత్, ఫిలిం డైరెక్టర్ రమానంద్ సాగర్ తీసిన రామాయణ్ సీరియల్స్‌కు పైరసీ నుంచి రక్షణ ఉంటుందని ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ రచనలకు కూడా ఇదే వర్తిస్తుందని ధర్మాసనం పేర్కొన్నది. భక్తివేదాంత బుక్ ట్రస్ట్ పుస్తకాల్లోని కంటెంట్‌కు పేటెంట్ హక్కులు వర్తిస్తాయని, ఈ పుస్తకాల్లోని కంటెంట్‌ను తీసుకోకుండా కొన్ని సంస్థల్ని నిరోధిస్తూ ధర్మాసనం తీర్పు వెలువరించింది.
ఈ అంశంపై ట్రస్ట్ న్యాయస్థానాన్ని ఆశ్రయించగా, ‘గ్రంథాన్ని బోధించే, వివరించే రచనల అసలు భాగాలకు కాపీరైట్ వర్తిస్తుంది. వీటిపై పైరసీని అనుమతించం’ అని హైకోర్టు వ్యాఖ్యానించింది. ప్రింట్, ఆడియో, విజువల్..ఇలా ఏ రూపంలోనూ ట్రస్ట్ బుక్స్‌ను కాపీరైట్ చేయరాదని, ఆన్లైన్ వెబ్‌సైట్స్, మొబైల్ అప్లికేషన్స్, వెబ్‌లింక్స్, సోషల్‌మీడియాలో చూపరాదని ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. గూగుల్, మెటాలకు కోర్టు ఆదేశాలు జారీచేసింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్

