Supreme Court | సుప్రీంకోర్టును ఆశ్రయించిన నితీశ్ సర్కారు.. పాట్నా హైకోర్టు తీర్పుపై సవాల్
Supreme Court | నితీశ్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు ఇటీవల సవరించిన రిజర్వేషన్ చట్టాలను పాట్నా హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే.
Supreme Court | నితీశ్‌కుమార్ నేతృత్వంలోని బిహార్ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. 65శాతం రిజర్వేషన్లను రద్దు చేస్తూ పాట్నా హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేసింది. బిహార్‌లో నితీశ్ కుమార్ సర్కారు ఇటీవల సవరించిన రిజర్వేషన్ చట్టాలను పాట్నా హైకోర్టు రద్దు చేసిన విషయం తెలిసిందే. ప్రభుత్వం తరఫు న్యాయవాది మనీశ్ సింగ్ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. దళితులు, గిరిజనులు, వెనుకబడిన వర్గాల కోటాను 50శాతం నుంచి 65శాతం రిజర్వేషన్లు రాజ్యాంగ విరుద్ధమని కోర్టు తీర్పును వెలువరించిన విషయం తెలిసిందే. అయితే, రిజర్వేషన్లపై ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. ఎన్డీఏ కూటమికి బిహార్‌లో రిజర్వేషన్లను పెంచడం ఇష్టం లేదని ప్రతిపక్షాలు ఆరోపించాయి. రిజర్వేషన్లతో బీజేపీ ఆడుకోవాలని చూస్తుందని ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ సీఎం తేజస్వి యాదవ్ విమర్శించారు.
బీజేపీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని ఎన్నికల సమయంలో చెప్పామన్నారు. విపక్షాల ఈ ఆరోపణల మధ్య ఎన్డీయే ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. జూన్ 20న 65శాతం రిజర్వేషన్లు కల్పించే చట్టాన్ని పాట్నా హైకోర్టు రద్దు చేసింది. రిజర్వేషన్ల పెంపు రాజ్యాంగ విరుద్ధమని స్పష్టం చేసింది. కోర్టు ఆదేశాలతో షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగలు, వెనుకబడిన తరగతులకు విద్యాసంస్థలు, ప్రభుత్వ ఉద్యోగాలలో 65శాతం రిజర్వేషన్లు నిలిచిపోయాయి. ఇకపై గతంలో మాదిరిగానే 50శాతం రిజర్వేషన్లు అమలు కానున్నాయి. ఎన్డీఏ కూటమిలోని ప్రభుత్వం రిజర్వేషన్లు 65శాతం పెంచగా.. ఆర్థికంగా బలహీన వర్గాలకు ఇచ్చిన 10శాతం రిజర్వేషన్లు కలిపితే మొత్తం 75శాతానికి పెరగనున్నది. రిజర్వేషన్లను అమలులోకి తీసుకువస్తూ 2013 నవంబర్ 21న ప్రభుత్వం గెజిట్‌ను ప్రచురించింది. ఆ తర్వాత పలువురు రిజర్వేషన్లను హైకోర్టులో సవాల్ చేయగా.. రద్దు చేస్తూ ఆదేశాలు ఇచ్చింది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
American Jets | ఒకదానినొకటి తాకిన రెండు విమానాల రెక్కలు.. తప్పిన పెను ప్రమాదం..!
Kaaka | చిరంజీవి ‘కాకా’ రిలీజ్‌పై క్లారిటీ.. సంక్రాంతి బరిలో మెగాస్టార్, జనవరి 13న మెగా పొంగల్!
Chiranjeevi | మెగాస్టార్‌గా ఎదగడానికి కారణం అదే.. బీర్ తాగమని ఫ్రెండ్స్ ఒత్తిడి చేసినా నో చెప్పా: చిరంజీవి
Khammam Road Accident | గ్రీన్‌ఫీల్డ్ హైవేపై ఆగివున్న లారీని ఢీకొన్న ప్రైవేటు బస్సు.. 10 మంది ప్రయాణికులకు గాయాలు
Varanasi | వారణాసి రిలీజ్‌పై మళ్లీ సస్పెన్స్.. రాజమౌళి ఒక్క మాటతో ఫ్యాన్స్‌లో కొత్త టెన్షన్!
ట్రెండింగ్ వార్తలు
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!
Holiday list | 2027 కేంద్ర ప్రభుత్వ సెలవుల జాబితా విడుదల.. ఈ రోజుల్లో కేంద్ర కార్యాలయాలు క్లోజ్..!

