Ashish Vidyarthi | కొత్త పెండ్లి కొడుకు భోజన ప్రియుడే : ప్రముఖ డిష్‌లను ట్రై చేసిన ఆశిష్ విద్యార్ధి వీడియోలు వైరల్
ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి (Ashish Vidyarthi) అసోంకు చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రూపాలీ బరువాను వివాహం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
న్యూఢిల్లీ : ప్రముఖ నటుడు ఆశిష్ విద్యార్ధి (Ashish Vidyarthi) అసోంకు చెందిన ఫ్యాషన్ ఎంట్రప్రెన్యూర్ రూపాలీ బరువాను వివాహం చేసుకోవడం సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఇది ఆశిష్ విద్యార్ధికి రెండో వివాహం కాగా విద్యార్ధికి పలువురు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
ఇక కొత్త పెండ్లికొడుకు భోజన ప్రియుడని ఆశిష్ విద్యార్ధి యాక్టర్ వ్లోగ్స్ అనే ఆయన యూట్యూబ్ చానెల్లో పోస్ట్ చేసిన వీడియోలు వెల్లడిస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పేరొందిన వంటకాలను ఆశిష్ తరచూ ట్రై చేసే వీడియోలు సోషల్ మీడియాలో కనిపిస్తుంటాయి. నాగ్‌పూర్‌లోని స్పైసీ మటన్ సయోజీ కర్రీ నుంచి శ్రీలంకలో ఫ్రెష్ హనీకాంబ్ వరకూ ఎన్నో నోరూరించే డిష్‌లను ఆయన టేస్ట్ చేసే వీడియోలు వైరల్ అయ్యాయి.
ఆశిష్ ఇటీవల ఢిల్లీ ఫేమస్ నటరాజ్ చోలే భటూరేను బెంగళూర్ బ్రాంచ్‌లో ట్రై చేసిన వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది. అలాగే దేశవ్యాప్తంగా పేరొందిన రత్లామి పోహను ఆయన స్వయంగా రత్లామిలోనే టేస్ట్ చేశారు. ఉడకబెట్టిన పోహాపై రత్లాం సేవ్, కొత్తిమీర, ఆనియన్స్, నిమ్మరసంతో నిండి నోరూరించే వీడియో నెటిజన్లను ఆకట్టుకుంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి
Viral dance | ఆఫీస్ దీపావళి వేడుకల్లో యువతి డ్యాన్స్.. ఇంటర్నెట్లో ఏకంగా రెండు కోట్ల వ్యూస్.. Video
Watch: శివసేన నేత ఇంట్లో డ్రగ్స్ ఉంచిన పోలీస్ అధికారి.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral news | ఆ ఇంట్లో రోజూ నాగుపాముల కలకలం.. ఏడ వెతికినా పాము గుడ్లే..!
Viral News | అనారోగ్యంతో ఉన్న అమ్మకోసం కేంద్ర మాజీ మంత్రి వేణుగానం..!

