భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు
సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ సువిధ పోర్టల్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల అనుగుణంగా ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది.
న్యూఢిల్లీ: భారత్‌కు వచ్చే అంతర్జాతీయ విమాన ప్రయాణికులకు కొత్త నిబంధనలు జారీ అయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులు ఇకపై కోవిడ్ వ్యాక్సినేషన్‌కు సంబంధించిన స్వీయ డిక్లరేషన్ ఫారాలను ఎయిర్ సువిధ పోర్టల్‌లో పూరించాల్సిన అవసరం లేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. సోమవారం అర్ధరాత్రి నుంచి ఇది అమల్లోకి వస్తుందని పేర్కొంది. పౌర విమానయాన మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం సాయంత్రం ఒక ఉత్తర్వు జారీ చేసింది. దేశంతోపాటు ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు తగ్గడం, వ్యాక్సినేషన్లో గణనీయమైన పురోగతి కొనసాగుతున్నందున్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గతంలో జారీ చేసిన ఆదేశాలను సవరించినట్లు అందులో పేర్కొంది. సవరించిన మార్గదర్శకాల ప్రకారం ఎయిర్ సువిధ పోర్టల్‌లో స్వీయ-డిక్లరేషన్ ఫారమ్‌ను సమర్పించాల్సిన అవసరం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ తెలిపింది. అయితే కరోనా పరిస్థితుల అనుగుణంగా ఈ నిర్ణయాన్ని సమీక్షిస్తామని పేర్కొంది.
కాగా, భారత్‌కు వచ్చే అంతర్జాతీయ ప్రయాణికులు తమ వ్యాక్సినేషన్ స్థితి, టీకా డోసులు ఎన్ని వేయించుకున్నారో అన్నది తప్పని సరిగా ఎయిర్ సువిధ పోర్టల్‌లో వెల్లడించాలి. అయితే ఇకపై ఆ వివరాలు వెల్లడించాల్సిన అవసరం లేదని విమానయాన మంత్రిత్వ శాఖ తాజా ఉత్తర్వుల్లో పేర్కొంది.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
man builds flying car | ఇంటర్నెట్లో 13 ఏళ్లుగా నేర్చుకుని.. ఎగిరే కారు తయారు చేసిన యువకుడు
Watch: ట్రాఫిక్ పోలీసుల నుంచి తప్పించుకునేందుకు బైకర్ యత్నం.. ఏం జరిగిందంటే?
Husband Hug | ప్రేమతో గట్టిగా కౌగిలించుకున్న భర్త.. పక్కటెముకలు విరిగి ఆస్పత్రి పాలైన భార్య
Watch: దసరా ఊరేగింపులో ఏనుగు బీభత్సం.. పరుగులు తీసిన జనం
Viral News | వేల్స్ తీరంలో అరుదైన దృశ్యం.. అద్భుతంగా ఫిన్ వేల్ ఫీడింగ్..!

