ఆ కొత్త మొక్కకు జలకన్య పేరు పెట్టిన శాస్త్రవేత్తలు

న్యూఢిల్లీ: భారతీయ శాస్త్రవేత్తలు కొత్త వృక్ష జాతి మొక్కను కనుగొన్నారు. అండమాన్‌లోని అర్చిపెలాగో దీవుల్లో దాన్ని గుర్తించారు. 2019లో ఆ దీవులకు వెళ్లిన వృక్ష శాస్త్రవేత్తలకు ఆ మొక్క దర్శనమిచ్చింది. ఆ మెరైన్ గ్రీన్ ఆల్గేకు జలకన్య (మెరమైడ్) అని పేరు పెట్టారు. తాము కనుగొన్న మొక్క కొత్తది అని చెప్పేందుకు వాళ్లకు రెండేళ్ల సమయం పట్టింది. అయితే ఆ దీవుల్లో ఆల్గేకు చెందిన కొత్త జాతిని కనుగొనడం గత నాలుగు దశాబ్ధాల్లో ఇదే మొదటిదన్నారు. పంజాబ్ సెంట్రల్ వర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు ఆ మొక్కకు అసిటబులేరియా జలకన్యకే అన్న శాస్త్రీయ నామాన్ని పెట్టారు. జలకన్య అంటే సముద్ర దేవత. కొత్తగా గుర్తించిన మొక్క చాలా అద్భుతంగా ఉందని, చాలా సున్నితమైన డిజైన్‌లో ఆ మొక్క ఉందని, ఛత్రీల తరహాలో ఆ జలకన్య కనిపిస్తున్నట్లు డాక్టర్ ఫెక్లీ బస్త్ తెలిపారు. జలకన్య మొక్క ఒకేఒక్క భారీ కణంతో తయారైనట్లు శాస్త్రవేత్తలు చెప్పారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

