New Criminal laws | తమిళనాడు సీఎం స్టాలిన్‌ను ప్రశంసించిన చిదంబరం
New Criminal laws | కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాల్లో రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసేందుకు స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం సత్యనారాయణన్ నేతృత్వం వహించనున్నారు.
New Criminal laws | కేంద్రం కొత్తగా తీసుకొచ్చిన క్రిమినల్ చట్టాల్లో రాష్ట్ర స్థాయిలో సవరణలు చేసేందుకు స్టాలిన్ నేతృత్వంలోని ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీకి మద్రాస్ హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి ఎం సత్యనారాయణన్ నేతృత్వం వహించనున్నారు. కమిటీ నివేదికను నెల రోజుల్లోపు ప్రభుత్వానికి అందించనున్నది. కమిటీ అనేక న్యాయవాద సంఘాలు, ఇతర వాటారుదారులతో చర్చించి.. అభిప్రాయాలను తీసుకోనున్నది. ఈ క్రమంలో స్టానిల్ ప్రభుత్వం నిర్ణయాన్ని కాంగ్రెస్ నేత పీ చిదంబరం మంగళవారం స్వాతించారు. రాజ్యాంగంలోనిని ఉమ్మడి జాబితాలో క్రిమినల్ చట్టం ఒక సబ్జెక్ట్ అని.. ఇది కొత్త చట్టాన్ని సవరించేందుకు రాష్ట్ర శాసనసభకు అధికారం ఉందంటూ ట్వీట్ చేశారు. రిటైర్డ్ జడ్జి కే సత్యనారాయణన్ను ఏకసభ్య కమిటీని నియమించడాన్ని సైతం ఆయన స్వాగతించారు. ఈ ఏడాది జూలై ఒకటి నుంచి మూడు చట్టాలు అమలులోకి వచ్చిన విషయం తెలిసిందే.
ఇదిలా ఉండగా.. కేంద్రం తీసుకువచ్చిన చట్టాల పేర్లు హిందీలో ఉన్నాయి. దాంతో ఆయా చట్టాల పేర్లను సైతం మార్చాలనే సూచనను ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఈ చట్టం పేర్లపై తమిళనాడు, కర్ణాటక అభ్యంతరం తెలిపాయి. రాజ్యాంగంలోని 348వ అధికరణం పార్లమెంట్లో ప్రవేశపెట్టే చట్టాలు ఆంగ్లంలో ఉండాలని పేర్కొంటున్నాయి. కొనసాగుతున్న నిరసనల మధ్య కొత్త క్రిమినల్ చట్టాలను హడావుడిగా అమలు చేశామని తమిళనాడు సమాచార, పౌర సంబంధాల శాఖ ఈ నెల 8న పేర్కొంది. ఇదిలా ఉండగా.. కొత్తగా తెచ్చిన చట్టంలోని పలు సెక్షన్లలో మార్పులు చేయాల్సిన అవసరంపై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు సీఎం స్టాలిన్ లేఖ రాశారు. కొత్త చట్టాలను వాయిదా వేయాలని, అన్ని రాష్ట్ర ప్రభుత్వాల అభిప్రాయాలను తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకోవాలన్నారు. చట్టాల్లో ఎలాంటి సవరణ చేయాలనే విషయంపై చర్చించేందుకు సీఎం సమావేశం నిర్వహించారు. అనంతరం రిటైర్డ్ జస్టిస్ సత్యనారాయణ్ అధ్యక్షతన ఏకసభ్య కమిషన్‌ను నియమించాలని నిర్ణయించారు. ఎలాంటి అధికారిక చర్చ లేకుండా, రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను వినకుండానే పార్లమెంట్లో ప్రవేశపెట్టారన్నారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Prabhas | వచ్చే ఏడాది దీపావళికి ‘స్పిరిట్’
Dasara Property Sales | దసరా సందడి నిల్.. అమ్మకాలు, లాంచింగ్ లేక వ్యాపారం దివాళా
Crazy Kalyanam | రివార్డులతోపాటు అవార్డులూ సాధించే సినిమా
Tiger Shroff | టైగర్ష్రాఫ్పై కాల్పులు.. తీవ్రంగా గాయపడిన డ్రైవర్
France Protests | ఫ్రాన్స్ అగ్నిగుండం.. భవనాలకు నిప్పు, దుకాణాలు లూటీ.. హింసాత్మకంగా మారిన నిరసనలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

