న్యూఢిల్లీ: యుద్ధ క్షేత్రంలో సైనికులు ధరించే ఆర్మీ కంబాట్ ప్యాటర్న్ కొత్త యూనిఫామ్ నమూనాను ఇటీవల విడుదల చేశారు. అయితే ఇది శ్రీలంకలోని పూర్వపు ఎల్టీటీఈ డ్రెస్‌ను పోలి ఉన్నట్లుగా సోషల్ మీడియాలో సెటైర్లు వెల్లువెత్తాయి. దీంతో ఈ యూనిఫామ్ నమూనాపై వస్తున్న విమర్శలను ప్రభుత్వం ఖండించింది.
ఆర్మీ కంబాట్ ప్యాటర్న్ కొత్త యూనిఫామ్‌ను నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) సహాయంతో డిజైన్ చేయించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. 15 నమూనాలు, ఎనిమిది డిజైన్లు, నాలుగు ఫ్యాబ్రిక్లను పరిశీలించిన తర్వాత కొత్త ఆర్మీ డ్రెస్ నమూనాను అభివృద్ధి చేసినట్లు చెప్పాయి.
ఆర్మీ కంబాట్ ప్యాటర్న్ కొత్త యూనిఫాం, పూర్వపు ఎల్టీటీఈ డ్రెస్‌కు భిన్నంగా ఉంటుందని ప్రభుత్వ వర్గాలు వివరించాయి. డ్రెస్ రూపాన్ని తప్పుదారి పట్టించే విధంగా ఫిల్టర్లను ఈ కొత్త డ్రెస్ నమూనాలో ఉపయోగించినట్లు తెలిపాయి. ఈ తేడా తెలియకుండా, హానికరమైన ఉద్దేశంతో తప్పుదారి పట్టించే విధంగా సోషల్ మీడియాలో సమాచారాన్ని వ్యాప్తి చేస్తున్నారని ఆ వర్గాలు ఆరోపించాయి.