NEET Aspirant Raped | బాలికపై నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు అత్యాచారం.. వీడియో తీసి బ్లాక్మెయిల్
NEET Aspirant Raped | నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. మరో విద్యార్థినిని ఒక టీచర్ లైంగికంగా వేధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ధైర్మం చేసిన ఆ యువతి టీచర్లపై ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు.
లక్నో: నీట్ కోచింగ్ సెంటర్ టీచర్లు ఒక బాలికపై అత్యాచారానికి పాల్పడ్డారు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశారు. (NEET Aspirant Raped) మరో విద్యార్థినిని ఒక టీచర్ లైంగికంగా వేధించిన వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో ధైర్మం చేసిన ఆ యువతి టీచర్లపై ఫిర్యాదు చేయడంతో వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో ఈ సంఘటన జరిగింది. 2022లో ఒక బాలిక నీట్ ప్రిపరేషన్ కోసం కాన్పూర్‌లోని ప్రసిద్ధ కోచింగ్ సెంటర్లో చేరింది. ఈ ఏడాది జనవరిలో బయోలజీ టీచర్ అయిన 32 ఏళ్ల సాహిల్ సిద్ధిఖీ తన ఇంట్లో పార్టీ పేరుతో ఆమెను ఆహ్వానించాడు. విద్యార్థులందరినీ పిలిచినట్లు అతడు చెప్పాడు.
కాగా, ఆ టీచర్ ఇంటికి చేరుకున్న ఆ బాలిక అక్కడ తాను మాత్రమే ఉన్నట్లు గ్రహించింది. మత్తుమందు కలిపిన డ్రింక్ ఇచ్చిన టీచర్ సిద్ధిఖీ ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. వీడియో రికార్డ్ చేసి ఆమెను బ్లాక్మెయిల్ చేశాడు. అతడి ఇంట్లో నిర్బంధించి పలుమార్లు రేప్ చేశాడు. ఒక పార్టీలో కెమిస్ట్రీ టీచర్ అయిన 39 ఏళ్ల వికాస్ పోర్వాల్ కూడా ఆ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు.
మరోవైపు హోలీ సందర్భంగా పేరెంట్స్‌ను కలిసేందుకు ఆ బాలిక తన ఇంటికి వెళ్లింది. దీంతో సిద్ధిఖీ ఆమెకు ఫోన్ చేశాడు. వెంటనే తిరిగి రాకపోతే ఆమె కుటుంబానికి హాని చేస్తానని బెదిరించాడు. అయితే సిద్ధిఖీ మరో విద్యార్థినిని లైంగికంగా వేధించిన వీడియో వైరల్ అయ్యింది. ఈ కేసులో అరెస్టైన అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. దీంతో ధైర్యం చేసిన ఆ యువతి గురువారం ఫిర్యాదు చేసింది. స్పందించిన పోలీసులు సిద్ధిఖీతోపాటు మరో టీచర్ వికాస్‌ను అరెస్ట్ చేశారు. వారిద్దరిని కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించారు.
Read Today's Latest National News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Watch: బైకర్పై ఏనుగు దాడి.. అతడ్ని పలుమార్లు తొక్కిన వీడియో వైరల్
Watch: దంపతులు టీవీ చూస్తుండగా ఇంట్లోకి ప్రవేశించిన చిరుత.. తర్వాత ఏం జరిగిందంటే?
Viral News | ఎన్‌క్లోజర్ నుంచి సొరంగం తవ్వి తప్పించుకున్న పెద్దపులి.. తర్వాత ఏమైందంటే..!
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్

